ఎఫ్ 3 (F3) డబుల్ కాదు..త్రిపుల్ బ్లాక్‌బస్టర్‌ ! .. క‌లెక్ష‌న్ల కాసులు కురిపిస్తున్న కామెడీ సినిమా

Updated on Jul 05, 2022 10:10 PM IST
వెంక‌టేష్, వరుణ్ తేజ్ న‌టించిన‌ ఎఫ్3 (F3) త్వ‌ర‌లో 50 రోజుల మైలురాయిని దాట‌నుంది.
వెంక‌టేష్, వరుణ్ తేజ్ న‌టించిన‌ ఎఫ్3 (F3) త్వ‌ర‌లో 50 రోజుల మైలురాయిని దాట‌నుంది.

ఎఫ్2 సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన ఎఫ్ 3 (F3) క‌లెక్ష‌న్ల వివ‌రాల‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. వెంక‌టేష్, వరుణ్ తేజ్ హీరోలుగా ఈ సినిమాను ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి తెర‌కెక్కించారు.  తమన్నా .. మెహ్రీన్ కథానాయికలుగా న‌టించారు. ఎఫ్3 త్వ‌ర‌లో 50 రోజుల మైలురాయిని దాట‌నుంది. ఎఫ్ 3 ఇప్ప‌టివ‌ర‌కు రాబ‌ట్టిన వ‌సూళ్ల వివ‌రాలు ఎలా ఉన్నాయంటే..

క‌లెక్ష‌న్ల మోత మోగిస్తున్న ఎఫ్3 (F3)
ఎఫ్ 3 చిత్రం నైజాం ప్రాంతంలో రూ. 20.57 కోట్లు, సీడెట్ ఏరియాలో రూ. 8.58 కోట్లు, తూర్పు గోదావరిలో రూ. 4.18 కోట్లు, పశ్చిమలో రూ. 3.14 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 7.48 కోట్లు, గుంటూరులో రూ. 4.18 కోట్లు, కృష్ణాలో రూ. 3.23 కోట్లు, నెల్లూరులో రూ. 2.31 కోట్లు వసూలు చేసింది. 

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎఫ్3 రూ. 53.94 కోట్ల షేర్‌ను వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే రూ.134 కోట్ల గ్రాస్‌ను, 70.94 కోట్ల షేర్‌ను రాబ‌ట్టింది.  ఎఫ్ 3 సినిమా వ‌సూళ్ల వివ‌రాల‌ను చిత్ర యూనిట్ సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించింది. 

ఓటీటీలో రిలీజ్ ఎప్ప‌డంటే
ఎఫ్‌3 సినిమా త్వ‌ర‌లో ఓటీటీలో విడుద‌ల కానుంది. ఈ సినిమా ఓటీటీ హక్కుల్ని సోనీ లివ్ సొంతం చేసుకుంది. ఎఫ్ 3 విడుదలైన 50 రోజుల తరువాత ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఎఫ్ 3 విడుద‌లై 40 రోజులు అవుతోంది.. అంటే మరో పదిరోజుల్లో ఎఫ్‌3 ఓటీటీలో రిలీజ్ కానుంది. 

అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఎఫ్ 3(F3) లో రాజేంద్రప్రసాద్, మురళీ శర్మ, అలీ, సునీల్‌లు కీల‌క పాత్ర‌లలో న‌టించారు. కామెడీతో సాగిపోయే ఎఫ్‌3 సినిమా ఓ రేంజ్‌‌లో థియేట‌ర్ల‌లో న‌వ్వులు పూయించింది. 

ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి 'ఎఫ్ 3' చిత్రానికి సీక్వెల్‌గా 'ఎఫ్ 4' చిత్రాన్ని కూడా తెర‌కెక్కిస్తార‌ట‌. 

Read More: F3 Movie OTT Release: 'ఎఫ్ 3' మూవీ ఓటీటీ రిలీజ్ పై క్లారిటీ.. డిజిటల్ స్ట్రీమింగ్ ఎప్పటినుంచి అంటే?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!