Victory Venkatesh: వెంకీ మామ కామెడీకి ఫిదా అయిన "F 3" అభిమానులు... ఈ సినిమా 3 రోజుల కలెక్షన్ ఎంతో తెలుసా?

Updated on Jun 04, 2022 02:00 PM IST
మే 27 న విడుదలైన F3 సినిమా మూడు రోజుల్లో నమోదు చేసిన కలెక్షన్ల వివరాలు మీకోసం
మే 27 న విడుదలైన F3 సినిమా మూడు రోజుల్లో నమోదు చేసిన కలెక్షన్ల వివరాలు మీకోసం

థియేటర్లలో సోగాళ్ల సందడి మొదలైంది. వెంకీ మామతో (Venkatesh) పాటు మెగా నటుడు వరుణ్ తేజ్ (Varun Tej) అందించిన న‌వ్వుల విందును ప్రేక్షకులు బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. F3 సినిమా.. ఇప్పుడు టాలీవుడ్ కామెడీ చిత్రాలలో కొత్త ఒరవడిని  సృష్టించింది. F2 ఫ్రాంఛైజీలో భాగంగా విడుదలైన, F 3 అభిమానుల అంచనాలను వమ్ము చేయలేదని విశ్లేషకులు అంటున్నారు. 

అనిల్ రావిపూడి (Anil Ravipudi) ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్‌రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రంలో.. త‌మ‌న్నా, మెహ‌రీన్ కూడా అలవోకగా తమ అందాలను ఒలకబోశారు. దీనికి తోడు సోనాల్ చౌహాన్ గ్లామ‌ర్ కూడా చిత్ర విజయానికి కారణమైంది. ఇక నటకిరిటీ రాజేంద్ర ప్ర‌సాద్‌ చేసిన కామెడీ అదుర్స్ అంటున్నారు ప్రేక్షకులు. ఇలాంటి పాత్రలు ఆయనకు కొట్టిన పిండి. అలాగే చాలా రోజుల తర్వాత సునీల్ తనదైన శైలిలో, వెరైటీ కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. 

మే 27 న విడుదలైన F3 సినిమా మూడు రోజుల్లో నమోదు చేసిన కలెక్షన్ల వివరాలు మీకోసం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో F3 సినిమా మూడు రోజుల వసూళ్లు

నైజాం - రూ. 12.20 కోట్లు
సీడెడ్ - రూ. 3.59 కోట్లు
ఉత్త‌రాంధ్ర - రూ. 3.32కోట్లు
తూర్పు - రూ. 1.88 కోట్లు
పశ్చిమం - రూ. 1.54 కోట్లు
గుంటూరు - రూ. 2.06 కోట్లు
కృష్ణా - రూ. 1.77 కోట్లు
నెల్లూరు - రూ. 1.15 కోట్లు

ఇక క‌ర్ణాట‌క‌తో పాటు ఇతర రాష్ట్రాల మొత్తం -  రూ. 1.80 కోట్లు ఓవ‌ర్ సీస్ - రూ.5.20 కోట్లు 

మొత్తం షేర్ - రూ. 34.51 కోట్లు
గ్రాస్ - రూ.58 కోట్లు 
ప్రిరిలీజ్ బిజినెస్ - 63.60 కోట్లు

(అంటే బ్రేక్ ఈవెన్ కావాలంటే, కలెక్షన్ రూ. 64.50 కోట్లు దాటాలి. అలాగే సినిమా హిట్ కావాలంటే, ఇంకో రూ. 30 కోట్లు కచ్చితంగా వసూలు చేయాలని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!