రామ్‌ పోతినేని (Ram Pothineni)– -బోయపాటి కాంబినేషన్‌ సినిమాలో తమిళ హీరో.. మల్టీస్టారర్‌గా తెరకెక్కనుందా?

Updated on Jun 27, 2022 05:22 PM IST
రామ్ పోతినేని, శివ కార్తికేయన్
రామ్ పోతినేని, శివ కార్తికేయన్

ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ పోతినేని (Ram Pothineni) ఇస్మార్ట్‌ శంకర్‌, రెడ్‌ సినిమాల విజయంతో ఫుల్‌ జోష్‌లో ఉన్నాడు. తాజాగా షూటింగ్‌ పూర్తయిన ‘ది వారియర్‌' సినిమా కూడా త్వరలోనే విడుదల కాబోతోంది. ఈ సినిమా తర్వాత రామ్‌ యాక్షన్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే.

అయితే తాజాగా ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన విషయం చక్కర్లు కొడుతోంది. ఇంతకీ విషయం ఏంటంటే ఈ సినిమాలో రామ్‌తో పాటు మరో స్టార్‌ హీరో కూడా నటించనున్నాడట. బోయపాటి శ్రీను, రామ్‌ పోతినేని కాంబినేషన్‌లో పాన్‌ ఇండియా సినిమాను శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెంబర్‌ 9గా ప్యాషనేట్‌ ప్రొడ్యూసర్‌ శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు.

బోయపాటి శీనుతో రామ్ పోతినేని

అదిరిపోయే అప్‌డేట్స్..

ఈ నెల మొదటి వారంలో మూవీ పూజా కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ అనౌన్స్‌ చేసినప్పటి నుంచి అదిరిపోయే అప్డేట్స్‌ అందుతున్నాయి. ముఖ్యంగా ఈ చిత్రం స్టార్‌ కాస్ట్‌ పై ఇంట్రెస్టింగ్‌ వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే రామ్‌ మూవీ కోసం బోయపాటి బాలీవుడ్‌ హీరోయిన్స్‌ని సంప్రదిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

తన గ్లామర్​తో పరిణీతి చోప్రా ఎంత క్రేజ్‌ తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రామ్‌ కి మెయిన్‌ ఫీమేల్‌ లీడ్‌గా చేయడానికి పరిణీతితో సంప్రదింపులు జరుపుతున్నారట బోయపాటి శీను. దాదాపుగా పరిణీతి ఖరారయ్యే ఛాన్స్‌ ఉందని అప్పట్లో  వార్తలు కూడా వచ్చాయి. తాజాగా మరో క్రేజీ రూమర్‌ నెట్టింట చక్కర్లు కొడుతోంది.

బోయపాటి శీను, రామ్‌ పోతినేని

తమిళ స్టార్‌‌ కూడా..

యాక్టింగ్‌, సూపర్‌ డాన్స్‌, హై ఎనర్జీ లెవెల్స్‌ ఉన్న రామ్‌ పోతినేనితో పాటు.. మరో స్టార్‌ హీరో కూడా ఈ సినిమాలో నటించనున్నట్టు టాక్‌ వినిపిస్తోంది. తెలుగులోనూ మంచి మార్కెట్‌ ఉన్న తమిళ స్టార్‌ శివ కార్తికేయన్‌ను తీసుకోనున్నట్టు సమాచారం.

దీంతో సినిమాను మల్టీస్టారర్‌‌గా తెరకెక్కించబోతున్నారా అనే ప్రచారం కూడా జరుగుతోంది. అలాగే ఈ సినిమాను పాన్‌ ఇండియా రేంజ్‌లో రిలీజ్‌ చేసేందుకు మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారంట. ఏదేమైనా ఈ క్రేజీ అప్‌డేట్స్‌తో రామ్‌ –- బోయపాటి ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొంటున్నాయి.  

పూరీ జగన్నాథ్‌ తెరకెక్కించిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సినిమా రామ్‌ (Ram Pothineni) కెరీర్‌‌కు కావాల్సిన ఊపు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం బోయపాటి, తమిళ డైరెక్టర్‌  లింగుసామి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు రామ్. ‘ది వారియర్‌'పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ సాంగ్స్‌, ట్రైలర్‌ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తున్నాయి. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకొని వచ్చే నెలలో రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.

Read More : ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న రామ్ పోతినేని (Ram Pothineni) ! నెట్టింట హల్‌చల్ చేస్తున్న వార్తలో నిజమెంతో?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!