హీరో రామ్ (Ram Pothineni), ద‌ర్శ‌కుడు బోయపాటి కాంబోలో పాన్ ఇండియా సినిమా.. ఇక అదుర్సే అంటున్న ఫ్యాన్స్

Updated on Jun 01, 2022 08:58 PM IST
రామ్ పోతినేని (Ram Pothineni)తో బోయ‌పాటి యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన్ సినిమా తీయ‌నున్నారు.
రామ్ పోతినేని (Ram Pothineni)తో బోయ‌పాటి యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన్ సినిమా తీయ‌నున్నారు.

హీరో రామ్ పోతినేని (Ram Pothineni), ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను (Boyapati Sreenu) కాంబినేష‌న్‌లో ఓ సినిమా తెర‌కెక్క‌నుంది. స్రవంతి బ్యానర్లో వీరి కాంబోలో పాన్ ఇండియా రేంజ్‌లో సినిమా తీస్తున్నారు. రామ్ కొత్త సినిమా త్వ‌ర‌లో సెట్స్ పైకి వెళ్ల‌నుంది. అందుకు సంబంధించిన పూజా కార్య‌క్ర‌మాలు బోయ‌పాటి నిర్వ‌హించారు. బూరుగుపల్లి శివరామకృష్ణ కెమెరా రామ్ సినిమాకు కెమెరా స్విచ్చాన్ చేశారు. స్రవంతి రవికిశోర్ క్లాప్ ఇచ్చారు. రామ్ సినిమా ముహూర్తపు షాట్‌ను బోయపాటి చిత్రీకరించారు.

రామ్, బోయ‌పాటి కాంబో ఇక‌ ర‌చ్చే

రామ్ పోతినేని (Ram Pothineni)తో బోయ‌పాటి యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన్ సినిమా తీయ‌నున్నారు. బోయ‌పాటితో ఓ మాస్ సినిమా రావాల‌ని రామ్ ఫ్యాన్స్ ఎప్ప‌టినుంచో ఎదురు చూస్తున్నారు. త్వ‌ర‌లో ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనుంది. ఐదు భాష‌ల్లో ఈ సినిమా విడుద‌ల కానుంది. రామ్ త‌న 20వ సినిమాను బ‌డా డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీనుతో తీయ‌నున్నారు. ర‌ష్మిక లేదా పూజ హెగ్డే రామ్‌కు జోడిగా న‌టించే అవకాశాలు ఉన్నాయ‌ని టాక్. బోయ‌పాటి శ్రీను అఖండ విజ‌యం త‌ర్వాత రామ్‌తో ఈ సినిమా తీస్తున్నారు. 

 

రేంజ్ పెంచుకోవాల‌నుకుంటున్న రామ్, బోయ‌పాటి

రామ్ (Ram Pothineni)తో చేసే సినిమాపై బోయ పాటి భారీ అంచ‌నాలతో స్టార్ డ‌మ్ పెంచుకోవాల‌ని చూస్తున్నారు. ఇండియ‌న్ సినిమాలో స్టార్ డైరెక్ట‌ర్‌గా మంచి పేరు తెచ్చుకునేందుకు బోయ‌పాటి ట్రై చేస్తున్నారు. రామ్ కూడా పాన్ ఇండియ‌న్ స్టార్ డ‌మ్ కోసం ఆరాట ప‌డుతున్నారు. ఇక ఎలాంటి సినిమాతో  వీరిద్ద‌రూ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తారో చూడాలి. ప్ర‌స్తుతం రామ్‌ వారియ‌ర్ సినిమా రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. లింగు స్వామి వారియ‌ర్ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. వారియ‌ర్ చిత్రంలో రామ్‌కు జోడిగా కృతిశెట్టి న‌టించారు. త‌మిళ్, తెలుగులో వారియ‌ర్ సినిమా విడుద‌ల కానుంది. 

Advertisement
Credits: taran adarsh

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!