నాగచైతన్య (Naga Chaitanya) ‘థాంక్యూ’ సినిమా ఐదు రోజుల కలెక్షన్లు ఎంతంటే? దారుణంగా పడిపోయిన షేర్
అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘థాంక్యూ’. వీరిద్దరి కాంబినేషన్‌లో 'మనం' తర్వాత వచ్చిన 'థాంక్యూ' సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించారు.
రాశీ ఖన్నా, మాళవికా నాయర్, అవికా గోర్ హీరోయిన్లుగా నటించిన థాంక్యూ సినిమా జూలై 22న విడుదలైంది. మొదటి షోతోనే సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. దీంతో ఓపెనింగ్స్ దారుణంగా పడిపోయాయి. నాగ చైతన్య కెరీర్‌లో ఇంత తక్కువ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమా థాంక్యూ.
నాగ చైతన్య కెరీర్‌లో బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచిన సినిమా 'యుద్ధం శరణం'. ఈ సినిమా కలెక్షన్లు దానికంటే తక్కువగా వచ్చే చాన్స్ ఉందని టాక్. మించి డిజాస్టర్ గా నిలిచే అవకాశాలు లేకపోలేదు.
5 రోజుల కలెక్షన్లు..
'థాంక్యూ' సినిమా 5 డేస్ కలెక్షన్స్‌ను గమనిస్తే :
నైజాం 1.27 cr
సీడెడ్ 0.41 cr
ఉత్తరాంధ్ర 0.54 cr
ఈస్ట్ 0.29 cr
వెస్ట్ 0.18 cr
గుంటూరు 0.21 cr
కృష్ణా 0.23 cr
నెల్లూరు 0.13 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 3.26 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.25 cr
ఓవర్సీస్ 0.82 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 4.33 cr
రూ.23.85 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగింది 'థాంక్యూ' సినిమా. అయితే 5 రోజుల్లో ఈ సినిమా కేవలం రూ.4.33 కోట్ల షేర్‌ను మాత్రమే రాబట్టింది. మంగళవారం ఈ సినిమా రూ.20 లక్షల షేర్‌తోనే సరిపెట్టుకుంది. రవితేజ హీరోగా నటించిన 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమా ఈ శుక్రవారం రిలీజ్ అవుతుండడంతో నాగచైతన్య (Naga Chaitanya) 'థాంక్యూ' సినిమా కలెక్షన్లు మరింత పడిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
Read More : మరోసారి పోలీస్ ఆఫీసర్‌గా అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya)! ఈసారైనా కలిసొచ్చేనా?