మరోసారి పోలీస్ ఆఫీసర్‌‌గా అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya)! ఈసారైనా కలిసొచ్చేనా?

Updated on Jul 20, 2022 12:31 AM IST
సాహసం శ్వాసగా సాగిపో సినిమాలో పోలీస్ ఆఫీసర్‌‌గా అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya)
సాహసం శ్వాసగా సాగిపో సినిమాలో పోలీస్ ఆఫీసర్‌‌గా అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya)

అక్కినేని న‌ట‌వార‌సుడిగా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టారు అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya). త‌న న‌ట‌న‌తో అభిమానులను సంపాదించుకున్నారాయన. వెరైటీ కథలను సెలక్ట్ చేసుకుంటూ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు నాగచైతన్య.

‘ల‌వ్‌స్టోరి’, ‘బంగార్రాజు’ సినిమాలతో వరుస విజయాలను అందుకున్నారు చై. తాజాగా నాగచైతన్య హీరోగా నటించిన సినిమా ‘థ్యాంక్యూ’. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూలై 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ప్రమోషన్లలో జోరు పెంచింది చిత్ర బృందం. ఈ సందర్భంగా నాగచైతన్య ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. అందులో ఆయన పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.అంతేకాకుండా తన తర్వాతి సినిమాలకు సంబంధించిన విశేషాలను కూడా పంచుకున్నారు.

నాగచైతన్య నటించిన థ్యాంక్యూ సినిమా రిలీజ్‌కు సిద్దంగా ఉంది. ఈ సినిమా తర్వాత చై.. దూత అనే వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్నారు. ఈ సిరీస్ షూటింగ్ పూర్తయిన తర్వాత వెంకట్‌ ప్రభు డైరెక్షన్‌లో ఒక సినిమా చేయబోతున్నారు నాగచైతన్య. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.

అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya)

ఆకట్టుకోలేకపోయిన చై..

నాగచైతన్య – వెంకట్ ప్రభు కాంబినేషన్‌లో తెరకెక్కబోయే సినిమాలో చై.. పోలీస్ ఆఫీసర్‌‌గా నటించనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. గతంలో వచ్చిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాలో నాగచైతన్య పోలీస్ ఆఫీసర్‌‌గా నటించారు. అయితే ఆ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

త్వరలో విడుదల కాబోతున్న థ్యాంక్యూ సినిమాలో నాగచైతన్య (Naga Chaitanya) సరసన రాశీ ఖన్నా, మాళవికా నాయర్, అవికా గోర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్‌ఎస్‌ థమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాను శ్రీ వేంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్‌‌పై దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మించారు.

Read More : ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ సినిమాపై వివాదం.. మణిరత్నం (ManiRatnam), చియాన్‌ విక్రమ్‌ (Vikram)కు లీగల్ నోటీసులు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!