నాగచైతన్య (Naga Chaitanya) కోసం కార్తికేయ2 సినిమా రిలీజ్ పోస్ట్‌ పోన్‌ చేసి నిఖిల్‌ (Nikhil) తప్పు చేశారా?

Updated on Jul 26, 2022 10:11 PM IST
నాగచైతన్య (Naga Chaitanya) కోసం కార్తికేయ2 సినిమా రిలీజ్‌ను పోస్ట్‌ పోన్‌ చేసుకున్నారు నిఖిల్‌ (Nikhil)
నాగచైతన్య (Naga Chaitanya) కోసం కార్తికేయ2 సినిమా రిలీజ్‌ను పోస్ట్‌ పోన్‌ చేసుకున్నారు నిఖిల్‌ (Nikhil)

నాగచైతన్య (Naga Chaitanya) నటించిన థాంక్యూ సినిమా కోసం కార్తికేయ2 సినిమా రిలీజ్‌ను వాయిదా వేసుకున్నారు నిఖిల్ సిద్దార్ధ్‌ (Nikhil). థాంక్యూ సినిమా జూలై 22న విడుదలై నెగెటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇక, కార్తికేయ2 సినిమా కూడా జూలై 22వ తేదీనే విడుదల కావాల్సి ఉన్నా.. థాంక్యూ సినిమా నిర్మాత దిల్‌ రాజు అడగడంతో సినిమా రిలీజ్‌ను వాయిదా వేసుకుంది కార్తికేయ2 టీమ్.

నాగచైతన్య సినిమా రిలీజై నాలుగు రోజులు గడుస్తున్నా కనీసం నాలుగు కోట్లు కూడా వసూలు చేయలేదని టాక్. ఇంత దారుణమైన కలెక్షన్లు చై కెరీర్‌‌లో ఏ సినిమాకీ లేవని తెలుస్తోంది. మరోపక్క రణ్ బీర్ కపూర్ నటించిన ‘షంషేరా’ మూవీ కూడా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. యష్ రాజ్ ఫిల్మ్స్‌ షంషేరా సినిమాకు రూ.200 కోట్లు ఖర్చు చేసింది. అయితే ఈ సినిమా కనీసం రూ.40 కోట్లు అయినా కలెక్ట్ చేస్తుందా అని అనుమానం వ్యక్తం చేస్తున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. గత వారం రిలీజైన ‘ది వారియర్’ సినిమాకు కూడా నెగెటివ్‌ టాక్ వచ్చింది.

థియేటర్లలో మంచి సినిమా లేకపోవడంతో ఈ సమయంలో నిఖిల్ హీరోగా చేసిన కార్తికేయ2 సినిమా రిలీజ్ అయ్యుంటే బాగుండేది. నిజానికి థాంక్యూ సినిమా రిలీజ్ కోసం కార్తికేయ2 సినిమా విడుదలను ఆగస్టు 12కి వాయిదా వేశారు. వాయిదా వేసుకోవడం మైనస్‌ అయ్యింది నిఖిల్‌కు.

నాగచైతన్య (Naga Chaitanya) కోసం కార్తికేయ2 సినిమా రిలీజ్‌ను పోస్ట్‌ పోన్‌ చేసుకున్నారు నిఖిల్‌ (Nikhil)

ఈసారి నితిన్‌తో పోటీ..

ఆగస్టు 12వ తేదీన నితిన్ హీరోగా నటించిన మాచర్ల నియోజకవర్గం రిలీజ్‌ అయ్యేందుకు సిద్ధమైంది. ఈ సినిమాలో అంజలి ఐటమ్ సాంగ్ చేయడం, పోస్టర్స్ మాస్ యాంగిల్‌లో ఉండడంతో సినిమాపై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. దానికి ముందురోజు ఆమిర్ ఖాన్ నటించిన ‘లాల్ సింగ్ చడ్డా’ విడుదల అవుతోంది. ఈ సినిమా యూనిట్‌ కూడా ప్రమోషన్స్‌ను బాగానే చేస్తోంది. తెలుగులో ఈ సినిమాను మెగాస్టార్ సమర్పిస్తున్నారు.

ఇక, కార్తికేయ2 టీమ్ నిఖిల్‌ను వెరైటీగా చూపించి ఫ్యామిలీ ఆడియన్స్‌లో హైప్ తెచ్చే ప్రయత్నం చేశారు  మేకర్స్. ముందుగా ఫిక్స్‌ చేసుకున్న తేదీకే కార్తికేయ2 సినిమా డేట్ ప్రకారం విడుదల చేసినట్లయితే మూవీకి మినిమమ్ గ్యారంటీ ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం కాంపిటేషన్ గట్టిగానే ఉందని తెలుస్తోంది. నాగచైతన్య (Naga Chaitanya) కోసం రిలీజ్‌ డేట్‌ను పోస్ట్‌పోన్ చేసుకుని నిఖిల్ (Nikhil) తప్పుచేశాడని ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

Read More : నాగచైతన్య (Naga Chaitanya) హీరోగా తెరకెక్కిన ‘థాంక్యూ’ సినిమా కలెక్షన్లు మరీ అంత తక్కువా? ఆదివారం కూడా అంతంతే

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!