నా మార్గదర్శిగా ఉన్నందుకు ‘థ్యాంక్యూ’.. అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) ఎమోషనల్ పోస్ట్

Updated on Jul 07, 2022 07:25 PM IST
అమ్మ నాన్నలతో చిన్నప్పుడు అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya)
అమ్మ నాన్నలతో చిన్నప్పుడు అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya)

అక్కినేని వారసుడిగా ‘జోష్’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya). మొదటి సినిమా ఫలితం కొంత నిరాశపరిచినా ఆయన నటనకు మంచి మార్కులే వేశారు ప్రేక్షకులు. ఆ తర్వాత ఏ మాయ చేశావే, 100% లవ్, మనం, లవ్‌స్టోరీ సినిమాలతో అభిమానులను అలరించారు నాగచైతన్య.

నాగచైతన్య (Naga Chaitanya) హీరోగా నటించిన సినిమా ‘థ్యాంక్యూ’. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు చై. ఈ సందర్భంగా నాగచైతన్య సోషల్‌ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఆ పోస్ట్‌ వైరల్ అవుతోంది. థ్యాంక్యూ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా.. తన జీవితంలో కీలకపాత్ర పోషించిన వారికి కృతజ్ఞలు చెప్పారు.

'థ్యాంక్యూ'.. నేను ఎక్కువగా వాడే పదం. 'థ్యాంక్యూ' సినిమా త్వరలో రిలీజ్ కానున్న నేపథ్యంలో ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. నన్ను ఎక్కువగా ప్రేమించి, నా జీవితంలో కీలకం మారిన ఆత్మీయులకు ఈ పోస్ట్‌ను అంకితం చేస్తున్నాను. వాళ్లు నాపై చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు మాత్రమే సరిపోవు.

అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) చేసిన ట్వీట్

అమ్మ.. నా వెన్నంటే ఉంటూ.. ఎప్పటికప్పుడు ప్రతి విషయంలో నాకు మార్గదర్శిగా ఉంటూ.. అన్ని విధాలుగా నన్ను ప్రేమిస్తున్నందుకు థ్యాంక్యూ.

నాన్న.. నాకంటూ ఒక దారి చూపించి.. ఒక స్నేహితుడిలా ఉన్నందుకు కృతజ్ఞతలు

హాష్‌ (పెంపుడు కుక్క).. ప్రేమించడం ఎలాగో తెలిసేలా చేసి, నన్ను ఒక మనిషిగా ఉంచినందుకు 'థ్యాంక్స్' అని నాగచైతన్య పోస్ట్‌ పెట్టారు.

తమ జీవితాల్లో కీలకంగా ఉన్న వాళ్లకు కృతజ్ఞతలు చెబుతూ themagicwordisthankyou పేరుతో పోస్టులు పెట్టమని అభిమానులకు నాగచైతన్య పిలుపునిచ్చారు. నాగచైతన్య హీరోగా నటించిన 'థ్యాంక్యూ' సినిమాకు విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించారు. రాశీ ఖన్నా, మాళవికా నాయర్, అవికా గోర్ ఈ చిత్రంలో కథానాయికలుగా నటించారు. జూలై 22 వ తేదీన 'థ్యాంక్యూ' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

హీరోయిన్ సమంత, నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పలు కారణాలతో ఇటీవలే వాళ్లు విడాకులు తీసుకున్నారు. ఇక, 2017లో వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నప్పటి నుంచి సమంత, నాగచైతన్య.. హాష్‌ (పెంపుడు కుక్క)ని పెంచుకొంటున్నారు.

'హాష్‌' ఫొటోలను గతంలో సామ్‌ తరచూ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసేవారు. పోయినేడాది చైతన్య - సామ్‌ విడిపోయిన నాటి నుంచి హాష్‌ సమంత వద్దే ఉంది. ఈ క్రమంలో నాగచైతన్య (Naga Chaitanya) తాజాగా పెట్టిన పోస్ట్‌ వైరల్ అవుతోంది.

Read More : నాగచైతన్య (Naga Chaitanya) ‘థ్యాంక్యూ’ సినిమా విడుదల తేదీలో మార్పు.. వెల్లడించిన చిత్ర యూనిట్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!