ప్ర‌ముఖ సినీ జ‌ర్న‌లిస్టు గుడిపూడి శ్రీహరి మృతి!.. నివాళులు అర్పించిన చిరంజీవి (Chiranjeevi)

Updated on Jul 05, 2022 06:09 PM IST
చిరంజీవి (Chiranjeevi)తో పాటు ప‌లువురు సినీ ప్ర‌ముఖ‌లు శ్రీ హ‌రి మృతికి నివాళులు అర్పించారు. 
చిరంజీవి (Chiranjeevi)తో పాటు ప‌లువురు సినీ ప్ర‌ముఖ‌లు శ్రీ హ‌రి మృతికి నివాళులు అర్పించారు. 

సీనియర్ జర్నలిస్టు, సినీ విశ్లేష‌కుడు గుడిపూడి శ్రీహరి కన్నుమూశారు. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) గుడిపూడి శ్రీహరి ర‌చ‌న‌లు గుర్తు చేసుకుంటూ సోష‌ల్ మీడియా ద్వారా నివాళులు అర్పించారు. 86 ఏళ్ల శ్రీహరి కొంత కాలంగా ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ పడుతున్నారు.  గుడిపూడి శ్రీహ‌రి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అనే పుస్త‌కాన్ని రచించారు. అంతేకాకుండా  సినిమా స‌మీక్ష‌ల‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గుడిపూడి శ్రీహ‌రి మృతి ప‌ట్ల ప‌లువురు సినీ ప్ర‌ముఖులు నివాళులు అర్పించారు.

శ్రీ హ‌రికి నివాళి అర్పించిన చిరంజీవి(Chiranjeevi)
గుడిపూడి శ్రీహరి గారు నిబ‌ద్ధ‌త క‌లిగిన సినీ విమ‌ర్శ‌కుడ‌ని చిరంజీవి తెలిపారు. త‌న సినిమాల‌పై శ్రీ హ‌రి రాసిన విమ‌ర్శ‌లు ఆరోగ్యకరంగా ఉండేవ‌న్నారు. ఆ విమ‌ర్శ‌లు నటుడిగా త‌న‌కు తాను ఎప్పటికప్పుడు మెరుగు ప‌రుచుకోవ‌డానికి ఉప‌యోగప‌డేవ‌న్నారు. గుడిపూడి శ్రీ హ‌రి మ‌ర‌ణం సినీ పాత్రికేయ రంగానికి తీరని లోటన్నారు. శ్రీహ‌రి కుటుంబ స‌భ్యుల‌కు త‌న‌ ప్ర‌గాఢ సానుభూతిని తెలిపారు. చిరంజీవితో పాటు ప‌లువురు సినీ ప్ర‌ముఖ‌లు శ్రీ హ‌రి మృతికి నివాళులు అర్పించారు. 

శ్రీహ‌రి సేవ‌లు
గుడిపూడి శ్రీహరి దాదాపు 50 ఏళ్ల పాటు పాత్రికేయుడిగా, సినీ విశ్లేషకుడిగా సేవలను అందించారు. ఈనాడు, హిందూ, ఫిల్మ్ ఫేర్ వంటి ప్రముఖ పత్రికల్లో పని చేశారు. సినిమాల‌పై ఉన్న ఆస‌క్థితో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అనే పుస్తకాన్ని రాశారు. 1969 నుంచి హిందూ పత్రికకు సినిమా రివ్యూలు రాసేవారు. దాదాపు 20 ఏళ్ల పాటు ఆలిండియా రేడియోలో న్యూస్ రీడర్‌గా శ్రీహ‌రి సేవలందించారు. అలాగే ప్రముఖ సినీ వారపత్రిక 'సితార'లో ప‌దేళ్ల పాటు సినిమాలపై స‌మీక్ష‌లు నిర్వ‌హించేవారు. 

ద‌ర్శ‌క, నిర్మాత‌లు గుడిపూడి శ్రీహ‌రి సినిమా స‌మీక్ష‌ల కోసం ఎదురుచూసేవార‌ట‌. సినీ ప్ర‌ముఖులు కూడా శ్రీహ‌రి ఇచ్చే రివ్యూల‌ను ఎంతో ఆస‌క్తిగా చ‌దివేవార‌ట‌.  2013లో తెలుగు విశ్వవిద్యాలయం శ్రీ హ‌రికి 'కీర్తి పురస్కారం'ను ప్రకటించింది. 

Read More: Telugu Mythological Movies: భార‌త చలనచిత్ర చరిత్ర‌లో నిలిచిన తెలుగు పౌరాణిక చిత్రాలు (టాప్ 10 చిత్ర విశేషాలు)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!