అదితీ (Aditi Rao Hydari)కి బర్త్ డే విషెస్ చెప్పిన సిద్ధూ (Siddharth).. ఆ ఊహాగానాలకు ఊతమిచ్చేలా హీరో పోస్ట్! 

Updated on Oct 28, 2022 07:08 PM IST
అదితీ రావు హైదరీ (Aditi Rao Hydari)కి బర్త్ డే విషెస్ చెబుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో హీరో సిద్ధార్థ్ (Siddharth) పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది
అదితీ రావు హైదరీ (Aditi Rao Hydari)కి బర్త్ డే విషెస్ చెబుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో హీరో సిద్ధార్థ్ (Siddharth) పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది

టాలీవుడ్ ముద్దుగుమ్మ అదితీ రావు హైదరీ (Aditi Rao Hydari)కు యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. అందం, అభినయంతో యువతలో ఆమె పాపులారిటీ తెచ్చుకున్నారు. విభిన్నమైన సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును ఆమె సొంతం చేసుకున్నారు. అలాంటి అదితి ఇవాళ్టితో 36వ పడిలోకి అడుగు పెట్టారు. దీంతో ఆమెకు సోషల్ మీడియాలో సెలబ్రిటీలతోపాటు అభిమానుల నుంచి పుట్టిన రోజు విషెస్ తెలియజేస్తూ సందేశాలు వస్తున్నాయి. అందులో ప్రముఖ హీరో సిద్ధార్థ్ (Siddharth)చేసిన పోస్ట్ మాత్రం వైరల్‌గా మారింది. 

అదితీ రావు హైదరి, సిద్ధార్థ్‌కు మధ్య ఏదో ఉందని చాన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ మధ్య ఓ సెలూన్ నుంచి వీళ్లిద్దరూ కలసి బయటకు వస్తూ కెమెరాలకు చిక్కారు. దీంతో అదితి, సిద్ధార్థ్ మధ్య ఏదో ఉందనే పుకార్లకు మరింత బలం చేకూరింది. తాజాగా అదితి బర్త్ డేకు సిద్ధార్థ్ పెట్టిన పోస్ట్ వీరిద్దరూ లవ్‌లో ఉన్నారని కన్ఫర్మ్ చేస్తోందని నెటిజన్స్ అంటున్నారు. తొలిసారి అదితీతో కలసి దిగిన ఫొటోను షేర్ చేసిన ఈ హీరో.. ‘పుట్టిన రోజు ప్రిన్సెస్ ఆఫ్ హార్ట్, నీ కలలన్నీ నెరవేరాలని మనసారా కోరుకుంటున్నా’ అని సిద్ధార్థ్ రాసుకొచ్చారు. 

అదితీపై సిద్ధార్థ్ పెట్టిన పోస్టుపై సోషల్ మీడియాలో చాలా కామెంట్లు వస్తున్నాయి. అదితిని ప్రిన్సెస్‌గా పిలవడం, ఫొటోలు వారి మధ్య సాన్నిహిత్యాన్ని చూస్తుంటే వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. ఇకపోతే, అదితి.. సిద్ధార్థ్‌తో బర్త్ డేను సెలబ్రేట్ చేసుకునేందుకు చెన్నైకి వెళ్లారని సమాచారం. మరి, ఈ పుట్టిన రోజు వేడుకల ఫొటోలను కూడా సిద్ధార్థ్ తన అభిమానులతో పంచుకుంటారేమో చూడాలి!

ఇకపోతే, ‘చెలియా’ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అదితీ రావు ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా ఆశించినంత సక్సెస్ కాలేదు. దీంతో ఆమెకు సరైన గుర్తింపు దక్కలేదు. ఆ తర్వాత ‘సమ్మోహనం’ సినిమాతో కుర్రాళ్ల మనసుల్లో చోటు దక్కించుకుంది అదితి రావు హైదరి. కానీ ‘మహాసముద్రం’ సినిమా పూర్తిగా నిరాశ పర్చడంతో ఆమెకు అవకాశాలు కరువయ్యాయి. అదితి చివరగా ‘హేయ్ సినామిక’ సినిమాలో స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌ సరసన కనిపించారు.

Read more: నిత్యా మీనన్ (Nithya Menen) తల్లి కాబోతోందా.. ప్రెగ్నెన్సీ కిట్ పోస్ట్ చేసిన బ్యూటీ.. షాక్ లో ఫ్యాన్స్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!