'తన కుటుంబాన్ని శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారు'.. 'లైగర్' (Liger) బయ్యర్లపై పూరి జగన్నాథ్ ఫిర్యాదు!

Updated on Oct 27, 2022 10:47 AM IST
పూరి జగన్నాథ్ (Puri Jagannath) ఇంటిముందు ధర్నాకు దిగుతామని హెచ్చరిస్తూ ఎగ్జిబిటర్స్ ఓ సందేశాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే.
పూరి జగన్నాథ్ (Puri Jagannath) ఇంటిముందు ధర్నాకు దిగుతామని హెచ్చరిస్తూ ఎగ్జిబిటర్స్ ఓ సందేశాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే.

డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ (Puri Jagannath) టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఇటీవల ఆయన దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కించిన చిత్రం 'లైగర్' (Liger). ఈ చిత్రంలో హీరోయిన్ గా అనన్య పాండే నటించింది. ఇక నిర్మాతలుగా ఛార్మి, పూరి జగన్నాథ్, కరణ్ జోహార్ వ్యవహరించారు. అయితే భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ అయింది.

భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన 'లైగర్' (Liger) సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఎక్కువ ధర పెట్టి కొన్న డిస్ట్రిబ్యూటర్స్ కి, ఎగ్జిబిటర్స్ కి భారీగా నష్టం చేకూరింది. దీంతో లైగర్ సినిమాని తీసుకున్న డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అంతా తమ నష్టాన్ని భర్తీ చేయాలని పూరి జగన్నాథ్ చుట్టూ తిరుగుతున్నారు. ఈ మేరకు పూరి జగన్నాథ్ ఇంటిముందు ధర్నాకు దిగుతామని ఎగ్జిబిటర్స్ సైతం హెచ్చరిస్తూ ఒక సందేశాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే.

భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన 'లైగర్' (Liger) సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఎక్కువ ధర పెట్టి కొన్న డిస్ట్రిబ్యూటర్స్ కి, ఎగ్జిబిటర్స్ కి భారీగా నష్టం చేకూరింది.

దీంతో ఈ వివాదం టాలీవుడ్ లో చర్చగా మారింది. పూరి కూడా దీనిపై స్పందిస్తూ ఇస్తాను కానీ టైమ్ పడుతుంది, ధర్నాలు అంటూ ఏమైనా చేసి నా పరువు మాత్రం తీస్తే నేను ఊరుకోను అని మాట్లాడిన కాల్ వైరల్ గా మారింది. అయినా డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ తగ్గకపోవడంతో తాజాగా పూరి జగన్నాథ్ వారిపై పోలీసు కేసు నమోదు చేశాడు.

డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను, ఫైనాన్షియల్ శోభన్ బాబులు తన కుటుంబం పై దాడి చేయడానికి ఇతరులను హింసకు ప్రేరేపిస్తున్నారని పూరి జగన్నాథ్ తన ఫిర్యాదులో తెలియజేసినట్లు సమాచారం. ప్రస్తుతం తాను ముంబయిలో ఉన్నానని.. నేను లేనప్పుడు తన కుటుంబాన్ని శారీరకంగా, మానసికంగా వేధించి అక్రమంగా డబ్బులు వసూలు చేయాలని చూస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

తన (Puri Jagannath) నుండి చట్ట విరుద్ధమైన డబ్బు సేకరించేందుకే ఇలాంటి బ్లాక్ మెయిలింగ్ వేధింపులకు చేస్తున్నారని కేసులో నమోదు చేసినట్లుగా సమాచారం.

తన నుండి చట్ట విరుద్ధమైన డబ్బు సేకరించేందుకే ఇలాంటి బ్లాక్ మెయిలింగ్ వేధింపులకు చేస్తున్నారని కేసులో నమోదు చేసినట్లుగా సమాచారం. మాపై హింసకు పాల్పడేలా వీళ్ళు ఇతరులని ప్రోత్సహిస్తున్నారని, తమకు రక్షణ కావాలని ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ వివాదం మరింత ముదిరింది. టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అయితే దీనిపై ఇప్పటిదాకా విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) మాట్లాడకపోవడం గమనార్హం.

Read More: ‘లైగర్’ (Liger) ఎఫెక్ట్: పూరీ జగన్నాథ్ (Puri Jagannadh)కు బెదిరింపులు.. 27న ధర్నా చేస్తామని బయ్యర్ల వార్నింగ్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!