Archana Shastry: అర్చ‌న బ‌ర్త్ డే స్పెష‌ల్ స్టోరి.. నాట్యంతో న‌డ‌క‌లు నేర్చుకున్న న‌టి అర్చ‌న

Updated on Oct 08, 2022 08:01 PM IST
 అర్చ‌న శాస్త్రి (Archana Shastry) క్లాసిక‌ల్ డాన్స‌ర్. త‌న అమ్మ‌తో క‌లిసి దేశ విదేశాల్లో ప‌లు నృత్య ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇచ్చారు
అర్చ‌న శాస్త్రి (Archana Shastry) క్లాసిక‌ల్ డాన్స‌ర్. త‌న అమ్మ‌తో క‌లిసి దేశ విదేశాల్లో ప‌లు నృత్య ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇచ్చారు

టాలీవుడ్‌లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా, హీరోయిన్‌గా అర్చ‌న శాస్త్రి (Archana Shastry)న‌టించి గుర్తింపు తెచ్చుకున్నారు. చేసిన‌వి త‌క్కువ సినిమాలే అయినా త‌న న‌ట‌న‌తో నృత్యంతో ప్రేక్ష‌కుల మ‌న‌సు దోచుకుంది. అర్చ‌న క్లాసిక‌ల్ డాన్స‌ర్. త‌న అమ్మ‌తో క‌లిసి దేశ విదేశాల్లో ప‌లు నృత్య ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇచ్చారు అర్చ‌న‌. వేద‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. బిగ్ బాస్ తెలుగు సీజ‌న్  వన్‌తో అర్చ‌న మ‌రింత ఫేమ‌స్ అయ్యారు. నేడు అర్చ‌న పుట్టిన‌రోజు సందర్భంగా ఆ న‌టి గురించిన ప‌లు విశేషాలు పింక్ విల్లా ఫాలోవ‌ర్స్ కోసం.

 అర్చ‌న శాస్త్రి (Archana Shastry) క్లాసిక‌ల్ డాన్స‌ర్. త‌న అమ్మ‌తో క‌లిసి దేశ విదేశాల్లో ప‌లు నృత్య ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇచ్చారు

నాట్యంతో పెరిగిన అర్చ‌న‌

అర్చ‌న శాస్త్రి (Archana Shastry) 1981 అక్టోబ‌ర్ 8 తేదీన జ‌న్మించారు. అర్చ‌న త‌ల్లి విజయ న‌ర్త‌కి కావ‌డంతో ఆమె రెండో ఏట నుంచే నాట్యం చేసేది. దీంతో వాళ్ల అమ్మ అర్చ‌న‌కు నాట్యాన్ని నేర్పించారు. త‌ల్లీ కూతుళ్లు ఇద్ద‌రూ ఇండియాతో పాటు అమెరికా, దుబాయ్, యూర‌ప్, సింగ‌పూర్, మ‌లేషియా వంటి దేశాల్లో నృత్య ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇచ్చారు. అర్చ‌న డిగ్రీ పూర్తి చేశారు. అర్చ‌న‌కు నాగార్జున‌, శ్రీదేవీలు ఇష్ట‌మైన న‌టీన‌టులు. త‌ప‌న సినిమాతో అర్చ‌న టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. 

 అర్చ‌న శాస్త్రి (Archana Shastry) క్లాసిక‌ల్ డాన్స‌ర్. త‌న అమ్మ‌తో క‌లిసి దేశ విదేశాల్లో ప‌లు నృత్య ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇచ్చారు

బిగ్ బాస్‌తో మ‌రింత ఫేమ‌స్

'నేను', 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా', 'శ్రీరామదాసు', 'పౌర్ణమి', 'సామాన్యుడు', 'శ్రీ రామరాజ్యం'  సినిమాలలో న‌టించిన‌ అర్చన తెలుగు ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌లు పొందారు. తెలుగుతో పాటు త‌మిళ్, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల్లో న‌టించారు.  బిగ్ బాస్ (Big Boss) త‌రువాత హిందీ సినిమాల్లోకి అడుగు పెట్టారు అర్చ‌న‌.

 అర్చ‌న శాస్త్రి (Archana Shastry) క్లాసిక‌ల్ డాన్స‌ర్. త‌న అమ్మ‌తో క‌లిసి దేశ విదేశాల్లో ప‌లు నృత్య ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇచ్చారు

కొరియోగ్రాఫ‌ర్‌గా అర్చ‌న‌

కొరియోగ్రాఫ‌ర్‌గా కూడా అర్చ‌న శాస్త్రి (Archana Shastry) వ‌ర్క్ చేశారు. బాల‌కృష్ణ సినిమాలో గోపిక‌ల‌తో డాన్స్ చేసే ఓ చిన్న బిట్‌ను అర్చ‌న‌నే కంపోజ్ చేశారు. అలాగే య‌మ‌దొంగ‌లో ఓ సాంగ్‌కు కొరియోగ్ర‌ఫీ చేశారు. ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి 'మ‌గ‌ధీర' సినిమాలో ఓ క్యారెక్ట‌ర్ కోసం అర్చ‌న‌ను సంప్ర‌దించార‌ట‌. కానీ అప్పుడు అర్చ‌న ఆ పాత్ర‌లో న‌టించ‌చేందుకు ఒప్పుకోలేదు.

రాజ‌మౌళి ఇచ్చిన ఆఫ‌ర్ తిర‌స్క‌రించాన‌ని బాధ త‌న‌కు ఎప్పుడూ ఉంటుంద‌ని అర్చ‌న ప‌లు ఇంట‌ర్వ్యూల‌లో తెలిపారు. 2019లో  హెల్త్ కేర్ వైస్ ప్రెసిడెంట్‌ జగదీష్ భక్తవత్సలంను అర్చ‌న‌ పెళ్లి చేసుకున్నారు.

 అర్చ‌న శాస్త్రి (Archana Shastry) క్లాసిక‌ల్ డాన్స‌ర్. త‌న అమ్మ‌తో క‌లిసి దేశ విదేశాల్లో ప‌లు నృత్య ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇచ్చారు

వెండితెర‌పై మ‌రోసారి మెర‌వ‌నున్న అర్చ‌న‌

తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కలిపి హీరోయిన్ అర్చ‌న‌ సుమారుగా 40 సినిమాల్లో నటించారు. ఆమె పెళ్లికి ముందు నటించిన చిత్రం ‘వజ్ర కవచధర గోవింద’. పెళ్లి త‌రువాత దాదాపు  నాలుగేళ్ల త‌రువాత అర్చ‌న సెకెండ్ ఇన్సింగ్స్ మొద‌లు పెట్టారు. వెబ్ సిరీస్‌ల‌తో పాటు సినిమాల‌పై ఫోక‌స్ పెట్టారు. టెన్త్ క్లాస్ డైరీస్ సినిమాలో ప్ర‌త్యేక పాత్ర‌లో న‌టిస్తున్నారు. అర్చ‌న త‌న న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌కు వినోదం పంచ‌డంతో పాటు.. ప‌లు అవార్డులు అందుకోవాల‌ని పింక్ విల్లా కోరుకుంటుంది.

Read More: బిగ్ బాస్ సీజన్ 6 (Bigg Boss Season 6) : కెప్టెన్ గా సింగర్ రేవంత్ (Singer Revanth).. ఇనయా (Inaya) ఎమోషనల్!

 అర్చ‌న శాస్త్రి (Archana Shastry) క్లాసిక‌ల్ డాన్స‌ర్. త‌న అమ్మ‌తో క‌లిసి దేశ విదేశాల్లో ప‌లు నృత్య ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇచ్చారు

హ్యాపీ బ‌ర్త్ డే అర్చ‌న‌
పింక్ విల్లా
 
Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!