Liger Promotions: విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Deverakonda)తో ఫైట్ చేయ‌లేక‌పోయిన నిహారిక‌ ఎన్‌.ఎమ్‌... ఎందుకంటే..

Updated on Aug 24, 2022 10:44 AM IST
విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Deverakonda) న‌టించిన  'లైగ‌ర్' కోసం నిహారిక చేసిన హడావుడి సోష‌ల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. 
విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Deverakonda) న‌టించిన 'లైగ‌ర్' కోసం నిహారిక చేసిన హడావుడి సోష‌ల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. 

Liger Promotions: టాలీవుడ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Deverakonda) న‌టించిన పాన్ ఇండియా సినిమా 'లైగ‌ర్' కొన్ని గంట‌ల్లో రిలీజ్ కానుంది. నెల రోజుల‌కు పైగా 'లైగ‌ర్' ప్ర‌మోష‌న్ల‌లో బిజీగా ఉన్నారు విజ‌య్. 'లైగ‌ర్' సినిమా కోసం సోష‌ల్ మీడియాలో మ‌రో కొత్త ప్ర‌మోష‌న్ నిర్వ‌హించారు. సోష‌ల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఎన్‌.ఎమ్‌.నిహారికతో 'లైగ‌ర్' హీరో ఫైటింగ్‌కు సిద్ధ‌మ‌య్యారు?. ప్ర‌స్తుతం వీరి ఫైటింగ్ వీడియో వైర‌ల్‌గా మారింది.  

విజ‌య్‌తో నిహారిక ఫైట్
ఎన్‌.ఎమ్‌. నిహారిక సోష‌ల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటారు. ద‌క్షిణాది భాష‌ల‌న్నీ తెలిసిన నిహారికకు మిలియ‌న్ల మంది ఫాలోవ‌ర్లు ఉన్నారు. కొన్ని రోజులుగా నిహారిక‌ ప‌లు చిత్రాల‌కు ప్ర‌మోష‌న్లు చేస్తుంది. య‌శ్ న‌టించిన 'కేజీఎఫ్ చాఫ్ట‌ర్ 2' చిత్ర ప్ర‌మోష‌న్‌తో నిహారిక పాపుల‌ర్ అయ్యారు. దీంతో నిహారిక‌తో మూవీ మేక‌ర్స్ ప్ర‌మోష‌న్ల‌ను నిర్వ‌హిస్తున్నారు. మ‌హేష్ బాబు న‌టించిన 'స‌ర్కారువారి పాట‌', అడ‌వి శేష్ సినిమా 'మేజ‌ర్‌'కు నిహారిక ప్ర‌మోష‌న్స్ చేసింది. ప్ర‌స్తుతం 'లైగ‌ర్' కోసం నిహారిక చేసిన హడావుడి సోష‌ల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. 

ఫ‌న్ ఫైట్
'లైగ‌ర్' హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Deverakonda)తో నిహారిక ఫైటింగ్ చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతుంది. విజ‌య్ కూడా సీరియ‌స్‌గా ఫైట్ చేస్తుంటాడు. విజ‌య్ దేవ‌ర‌కొండ నిహారిక‌ను బాక్సింగ్‌లో త‌ల‌ప‌డేందుకు పిల‌వ‌గా.. నిహారిక మాత్రం హీరోను హ‌గ్ చేసుకుంటుంది. దీంతో ఫైట్ కాస్త ఫ‌న్‌గా మారుతుంది. విజ‌య్ భ‌యంతో పారిపోతున్నావా అని అడుగ‌గా.. ఇంటికి వెళ్లిపోతున్నానంటూ స‌మాధానం ఇస్తుంది. విజ‌య్ దేవ‌రకొండ‌ పిల్లో పైట్ అని అంటుంటే.. తాను 'లైగ‌ర్' పిల్లో అంటూ స‌ర‌దాగా చెబుతుంది. ప్ర‌స్తుతం వీరి ఫైటింగ్ వీడియో  సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.  

'లైగ‌ర్' చిత్రాన్ని పాన్ ఇండియా లెవ‌ల్‌లో ద‌ర్శ‌కుడు పూరీ జ‌గన్నాథ్ తెర‌కెక్కించారు. విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Deverakonda), అన‌న్య పాండేలు జంట‌గా న‌టించిన‌ ఈ సినిమా ఆగ‌స్టు 25న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. మైక్ టైస‌న్‌, ర‌మ్య‌కృష్ణ‌న్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. భారీ బ‌డ్జెట్‌తో బాలీవుడ్ బ‌డా ద‌ర్శ‌క నిర్మాత క‌ర‌ణ్ జోహార్, హీరోయిన్ ఛార్మీకౌర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Read More: 'లైగ‌ర్స్' ప్ర‌మోషన్స్ - విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Deverakonda) పై వ‌స్తున్న ట్రోల్స్‌పై జ‌ర్న‌లిస్టు క్లారిటీ 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!