Karthikeya 2: బాలీవుడ్‌లో ‘కార్తికేయ 2’ సరికొత్త రికార్డు.. క‌లెక్ష‌న్ వివ‌రాలు షేర్ చేసిన నిఖిల్ !

Updated on Sep 07, 2022 12:54 PM IST
Karthikeya 2: హీరో  నిఖిల్ సిద్ధార్థ (Nikhil Siddhartha)  సినిమా 'కార్తికేయ 2' అమెరికాలో అరుదైన ఘ‌న‌త‌ను సాధించింది.
Karthikeya 2: హీరో  నిఖిల్ సిద్ధార్థ (Nikhil Siddhartha)  సినిమా 'కార్తికేయ 2' అమెరికాలో అరుదైన ఘ‌న‌త‌ను సాధించింది.

Karthikeya 2: బాలీవుడ్‌లో తెలుగు సినిమాలకు డిమాండ్ పెరిగింది. 'బాహుబ‌లి' త‌రువాత నార్త్ ప్ర‌జ‌లు సౌత్ సినిమాల‌ను చూసేందుకు ఆస‌క్తి చూపుతున్నారు. 'పుష్ప' సినిమా కూడా ఉత్త‌రాది ప్ర‌జ‌ల‌ను ఎంత‌గానో అల‌రించింది. ప్ర‌స్తుతం 'కార్తికేయ 2' సినిమాను నార్త్ ప్ర‌జ‌లు ఆద‌రిస్తున్నారు. హీరో  నిఖిల్ సిద్ధార్థ (Nikhil Siddhartha)  సినిమా 'కార్తికేయ 2' అమెరికాలో అరుదైన ఘ‌న‌త‌ను సాధించింది. నాలుగవ వారంలో అత్యధిక అమెరికా థియేటర్లలో ప్ర‌ద‌ర్శిత‌మ‌వుతున్న తెలుగు సినిమాగా కొత్త రికార్డును క్రియేట్ చేసింది. 

కోట్లాది రూపాయలను కొల్లగొడుతున్న కార్తికేయ 2

టాలీవుడ్ హీరో  నిఖిల్ సిద్ధార్థ న‌టించిన మైథలాజికల్ థ్రిల్లర్  'కార్తికేయ 2' ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల‌ను వ‌సూళ్లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా క‌లెక్ష‌న్ల మోత మోగిస్తోంది.  హీరో నిఖిల్ కెరీర్‌లోనే ఈ సినిమా  బిగ్గెస్ట్ బ్లాక్ బాస్ట‌ర్‌గా నిలిచింది. సౌత్ ఇండియాలోనే కాకుండా నార్త్ ఇండియా.. అలాగే అమెరికాలో కూడా 'కార్తికేయ 2' దూసుకుపోతోంది. 

మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ సాధించిన  'కార్తికేయ 2' (Karthikeya 2) హిందీ వెర్ష‌న్‌లోనూ భారీ వ‌సూళ్ల‌ను రాబ‌డుతోంది.  'బాహుబ‌లి', 'పుష్ప' సినిమాల త‌రువాత.. బాలీవుడ్‌లో భారీ వసూళ్లు రాబ‌ట్టిన సినిమాగా 'కార్తికేయ 2'  రికార్డు సాధించింది.  బాలీవుడ్‌లో ఇప్ప‌టివ‌ర‌కు  ఈ చిత్రం రూ. 30 కోట్లను కొల్ల‌గొట్టింది. భారీ స్థాయిలో ప్ర‌మోష‌న్లు లేకుండా 'కార్తికేయ 2' ఇంత‌టి బిజినెస్ చేయ‌డం గొప్ప విష‌య‌మ‌ని సినీ క్రిటిక్స్ అంటున్నారు.

ద్వార‌క న‌గ‌ర ర‌హ‌స్యాలు తెలిపే సినిమా

కృష్ణ తత్వాన్ని అర్థం చేసుకొనే క్రమంలో, పురాతన ద్వారక నగరంలోని అద్భుత రహస్యాలను చేధించే ఓ యువకుడి సాహస గాథే ఈ సినిమా. 'పుష్ప' త‌ర్వాత ఆ రేంజ్‌లో 'కార్తికేయ 2' సినిమాకు నార్త్‌లో డిమాండ్ ఏర్ప‌డింది. నిఖిల్‌కు జోడిగా ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ న‌టించారు.

ఈ చిత్రంలో కృష్ణ తత్వాన్ని ప్రచారం చేసే ధన్వంతరి పాత్రలో బాలీవుడ్ నటుడు అనుపమ్‌ఖేర్ నటించి మెప్పించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బ్యాన‌ర్లపై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగ‌ర్వాల్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు.

Read More: Karthikeya 2: 'కార్తికేయ 2' స‌క్సెస్ సంబురాలు... గ‌ర్వంగా ఉందన్న హీరో నిఖిల్(Nikhil Siddhartha)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!