Karthikeya 2 : కార్తికేయ 2 ట్రైలర్‌ రిలీజ్ అప్డేట్ .. నిఖిల్ సిద్ధార్థ్‌ (Nikhil Siddharth) కొత్త ప్రయోగం !

Updated on Jun 24, 2022 01:23 PM IST
హీరో నిఖిల్ సిద్ధార్థ్‌ (Nikhil Siddarth) నటిస్తున్న కార్తికేయ 2 చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా జూలై 22 న విడుద‌ల కానుంది.
హీరో నిఖిల్ సిద్ధార్థ్‌ (Nikhil Siddarth) నటిస్తున్న కార్తికేయ 2 చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా జూలై 22 న విడుద‌ల కానుంది.

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్‌ (Nikhil Siddharth) వ‌రుస సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌కు వినోదం పంచేందుకు ప్లాన్ చేస్తున్నారు. నిఖిల్ న‌టించిన కార్తికేయ 2 మొదటి ట్రైలర్ రిలీజ్ కానుంది. 'కార్తికేయ' చిత్రానికి సీక్వెల్‌గా 'కార్తికేయ‌ 2' సినిమాను చందు మొండేటి తెర‌కెక్కించారు.

'కార్తికేయ‌ 2' నుంచి తాజాగా రిలీజ్ అయిన మోషన్ పోస్టర్.. ఈ సినిమాపై ఆస‌క్తిని మరింత పెంచింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బ్యాన‌ర్లపై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగ‌ర్వాల్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ద్వారకా నగర రహస్యాల నేపథ్యంలో..

'కార్తికేయ 2' సినిమాలో నిఖిల్‌ (Nikhil Siddharth) కు జోడిగా అనుపమ పరమేశ్వరన్ న‌టిస్తున్నారు. ద్వార‌కా న‌గర ర‌హ‌స్యాల‌ నేపథ్యంలో 'కార్తికేయ 2' చిత్రం తెర‌కెక్కుతోంది. ఇటీవలే నిఖిల్ ఈ చిత్రానికి సంబంధించి ఆస‌క్తిక‌ర‌మైన టీజ‌ర్ ప్రోమో రిలీజ్ చేశారు. 

ధన్వంతరి పాత్రలో అనుపమ్ ఖేర్

ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, శ్రీనివాస‌రెడ్డి, ప్ర‌వీణ్‌, ఆదిత్యా మీన‌న్‌, తుల‌సి, స‌త్య, వైవా హ‌ర్ష‌, వెంక‌ట్ కీల‌క పాత్ర‌లలో న‌టిస్తున్నారు. 'కార్తికేయ 2' చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా జూలై 22 న విడుద‌ల కానుంది. ఈ చిత్రాన్ని తమిళం, మలయాళం, హిందీ భాషలలో కూడా డబ్ చేయనున్నారు. . 

ఈ సినిమాలో 'కార్తికేయ'గా నిఖిల్ (Nikhil Siddarth) లీడ్ రోల్ చేస్తున్నారు. అలాగే ముగ్ధ అనే పాత్రలో అనుపమ, ధన్వంతరి పాత్రలో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ న‌టిస్తున్నారు. ఇక సదానందగా శ్రీనివాసరెడ్డి డిఫెరెంట్ పాత్ర‌లో నటిస్తున్నారు. ఈ సినిమాకు కాల భైరవ సంగీతం అందిస్తున్నారు. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫర్‌గా వ్యవహారిస్తున్నారు. 

Read More: Karthikeya 2 : స‌ముద్రం దాచుకున్న అతి పెద్ద ర‌హ‌స్యం ఈ ద్వార‌కా న‌గ‌రం - కార్తికేయ 2 మోషన్ పోస్టర్ విడుద‌ల‌

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!