నిఖిల్ (Nikhil) న‌టిస్తున్న‌ 18 పేజెస్ సినిమా రిలీజ్ ఎప్పుడో తెలుసా!

Updated on Jun 12, 2022 11:54 PM IST
 నిఖిల్ (Nikhil) 18 పేజెస్ చిత్రం సెప్టెంబ‌ర్ 10న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.
నిఖిల్ (Nikhil) 18 పేజెస్ చిత్రం సెప్టెంబ‌ర్ 10న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ (Nikhil) మంచి స్పీడు మీద ఉన్నారు. నాలుగు సినిమాలలో న‌టిస్తూ బిజీ బిజీగా ఉన్నారు. వ‌రుస సినిమాల రిలీజ్‌తో ప్రేక్ష‌కుల‌కు వినోదం పంచ‌నున్నారు నిఖిల్. ప్ర‌స్తుతం నిఖిల్ న‌టిస్తున్న '18 పేజెస్' చిత్రం అప్‌డేట్ ఆయన అభిమానుల‌కు సంతోషాన్ని క‌లిగిస్తోంది.

అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) ఈ చిత్రంలో నిఖిల్‌కు జోడిగా న‌టిస్తున్నారు. ప‌ల్నాటి సూర్య ప్ర‌తాప్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న '18 పేజెస్' సినిమా రిలీజ్ డేట్‌ను ఇటీవలే ఫిక్స్ చేశారు. 

అనుప‌మ‌ ప‌ర‌మేశ్వ‌ర‌న్ తో జోడి కట్టిన నిఖిల్

18 పేజెస్ (18 Pages) మూవీ ఓ రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్‌ టైన‌ర్‌గా తెర‌కెక్క‌నుంది. అల్లు అరవింద్‌ సమర్పణలో గీతా ఆర్ట్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్స్‌పై బన్నీ వాసు, సుకుమార్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి గోపీసుంద‌ర్ సంగీతం అందిస్తున్నారు. 18 పేజెస్ చిత్రం సెప్టెంబ‌ర్ 10న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

 నిఖిల్ (Nikhil) 18 పేజెస్ చిత్రం సెప్టెంబ‌ర్ 10న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

కార్తికేయ 2 షూటింగ్‌లో నిఖిల్ బిజీ

నిఖిల్ (Nikhil) ప్ర‌స్తుతం 'కార్తికేయ 2' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. 'కార్తికేయ 2' సినిమా స‌ముద్ర గ‌ర్భంలో ద్వారకా న‌గ‌ర ర‌హ‌స్యాల‌పై తీస్తున్న థ్రిల్ల‌ర్ మూవీ. పాన్ ఇండియా సినిమాగా ఈ చిత్రం రిలీజ్ కానుంది. 'కార్తికేయ 2' చిత్రాన్ని నిర్మాతలు జూలై 22న విడుద‌ల చేస్తున్నారు.

ఇక నిఖిల్ న‌టిస్తున్న మ‌రో చిత్రం పేరు 'స్పై'. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, త‌మిళం, మ‌ళ‌యాళం, క‌న్న‌డ భాష‌ల్లో  విడుద‌ల చేయ‌నున్నారు. ఈడి ఎంట‌ర్టైన‌మెంట్స్ ప‌తాకంపై రాజ‌శేఖ‌ర్ రెడ్డి, చ‌ర‌ణ్ తేజ్ ఉప్ప‌ల‌పాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 2022 లో ద‌స‌రా టైంలో 'స్పై' (Spy) సినిమాను రిలీజ్ చేయాల‌ని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. 

Read More: నిఖిల్ సిద్ధార్థ్ నటించిన 'స్పై' సిన్మాలోని సీన్స్ అదుర్స్.. చూస్తే 'వావ్' అనాల్సిందే !
  

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!