Ante Sundaraniki: 'అంటే సుంద‌రానికీ' ఫైనల్ క‌లెక్ష‌న్ ఎంతంటే.. నాని ఖాతాలో మ‌రో ఫ్లాప్‌ మిగిలిందా?

Updated on Jul 07, 2022 07:25 PM IST
 Ante Sundaraniki: అంటే సుంద‌రానికీ ఫైన‌ల్ క‌లెక్ష‌న్ చేస్తే  రూ. 9.65 కోట్ల నష్టాలను మిగిల్చింది.
Ante Sundaraniki: అంటే సుంద‌రానికీ ఫైన‌ల్ క‌లెక్ష‌న్ చేస్తే  రూ. 9.65 కోట్ల నష్టాలను మిగిల్చింది.

Ante Sundaraniki:టాలీవుడ్‌లో హీరో నాని (Nani) న‌ట‌న‌కు ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. సినిమా హిట్టా.. ఫ‌ట్టా అనే విష‌యాలు నాని ప‌ట్టించుకోరు. త‌న‌కు న‌చ్చిన క‌థ‌ల‌తో సినిమాలు చేస్తుంటారు. నాని న‌టించిన అంటే..సుంద‌రానికీ సినిమా ఇటీవ‌ల విడుద‌ల అయిన విష‌యం తెలిసిందే. అయితే ఆ సినిమా వ‌సూళ్ల పరంగా ఎంత రాబ‌ట్టిందంటే..

క‌లెక్ష‌న్ వివ‌రాలు
రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా అంటే.. సుంద‌రానికీ జూన్ 10న రిలీజ్ అయింది. ఈ సినిమాలో నానికి జోడిగా నజ్రియా న‌టించారు. వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మైత్రీ మూవీ మేకర్స్ అంటే.. సుంద‌రానికీ చిత్రాన్ని నిర్మించింది. ఈ సినిమా విడుద‌ల‌కు ముందు నుంచే మేక‌ర్స్‌ టీజ‌ర్, ట్రైల‌ర్ల‌తో భారీ అంచ‌నాలు క్రియేట్ చేశారు. అయితే సినిమా విడుద‌ల అయ్యాక మాత్రం ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ రాబ‌ట్ట‌లేక‌పోయింది. 

రెండు కులాలకు సంబంధించిన ప్రేమ క‌థ‌ను ప్రేక్ష‌కులు అంత‌గా ఆద‌రించ‌లేదు. ప్రపంచవ్యాప్తంగా రూ. 22 కోట్ల షేర్‌ను రాబట్టింది. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో క‌లిపి రూ. 14 కోట్ల షేర్‌ను వ‌సూళ్లు చేసింది. మిగ‌తా రాష్ట్రాల్లో, ఓవర్సీస్ కలిపి ఈ సినిమా రూ. 21.35 వసూళు చేసింది. నాని సినిమా రూ. 30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ. 31 కోట్ల బ్రేక్ ఈవెన్‌తో బరిలో దిగింది అయితే ఫైన‌ల్ క‌లెక్ష‌న్ చేస్తే రూ. 9.65 కోట్ల నష్టాలను మిగిల్చింది. అంటే.. సుంద‌రానికీ ఫ్లాప్‌ను మిగిల్చింది. 

ఓటీటీలో రిలీజ్
అంటే సుందరానికీ సినిమా ఓటీటీలో విడుద‌ల కానుంది. ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్‌లో జూలై 10న స్ట్రీమింగ్‌కు రానుంది. ఈ చిత్రం విడుద‌లైన నెల రోజుల‌కు ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. అంటే.. సుంద‌రానికీ చిత్రం తెలుగుతో పాటు తమిళం, మలయాళ వెర్షన్‌లు ఒకే రోజు నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది.

Read More: Nani (నాని) : బిగ్ బితో ఓ అభిమాని గ‌డిపిన క్ష‌ణాలు.. వైర‌ల్‌గా మారిన ఫోటోలు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!