Ginna Movie Review : కొత్త తరహా కామెడీతో జనాలను ఆకట్టుకొనే ప్రయత్నం చేశాడు ఈ "జిన్నా"

Updated on Oct 22, 2022 09:49 PM IST
దేనికైనా రెడీ, దూసుకెళ్తా, రౌడీ లాంటి చిత్రాలతో తన పంథాలో సినిమాలు చేసుకుంటూ పోతున్న నటుడు మంచు విష్ణు (Manchu Vishnu).
దేనికైనా రెడీ, దూసుకెళ్తా, రౌడీ లాంటి చిత్రాలతో తన పంథాలో సినిమాలు చేసుకుంటూ పోతున్న నటుడు మంచు విష్ణు (Manchu Vishnu).

ఢీ, దేనికైనా రెడీ, దూసుకెళ్తా, అనుక్షణం, రౌడీ లాంటి చిత్రాలతో తన పంథాలో సినిమాలు చేసుకుంటూ పోతున్న నటుడు మంచు విష్ణు (Manchu Vishnu). ఈశాన్ సూర్య దర్శకత్వంలో ఇటీవలే విష్ణు నటించిన చిత్రం "జిన్నా". ఈ సినిమాపై ఆయనకు భారీ అంచనాలే ఉన్నాయి.  

కథ:
చిత్తూరుకి చెందిన గాలి నాగేశ్వరరావు అలియాస్ జిన్నా అనే యువకుడి కథ ఇది. ఊర్లో టెంట్ హౌస్ నడుపుకొనే జిన్నా (Ginna) .. ఏ వివాహ కార్యానికైనా సామాన్లు అద్దెకిస్తే ఆ పెళ్లి పెటాకులవుతుందని టాక్. దాంతో ఆయన చావు కార్యక్రమాలకు మాత్రమే టెంట్లు, ఇతర సామగ్రిని అద్దెకిస్తుంటాడు. జిన్నా ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు కూడా. ఆమె పేరు పచ్చళ్ల స్వాతి (పాయల్ రాజ్‌పుత్). 

అయితే స్వాతిని పెళ్లి చేసుకోవాలని భావించినప్పుడే రేణుక (సన్నీ లియోన్) అమెరికా నుండి ల్యాండ్ అవుతుంది. ఆస్తిపరురాలైన రేణుకకు దగ్గరై పెళ్లి చేసుకుంటే, తన కష్టాలు మొత్తం తీరిపోతాయని.. అలాగే ఊర్లో సర్పంచి పదవిని కూడా కొట్టేయవచ్చని జిన్నా ప్లాన్ చేస్తాడు. కానీ ఊహించని ఓ ట్విస్ట్ వల్ల జిన్నా జీవితమే మారిపోతుంది. అదేంటో తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే. 

సానుకూల అంశాలు
చాలా రోజుల తర్వాత విష్ణు (Manchu Vishnu) మంచి కామెడీ పాత్రలో మనకు కనిపించాడు. తన పాత్ర ద్వారా ప్రేక్షకులకు మంచి హాస్యాన్ని అందించే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా సైటెరికల్ కామెడీని పండించడంలో దాదాపు సక్సెస్ అయ్యాడు. అలాగే ఈ సినిమా రచయిత కూడా పాత్రలకు తగ్గినట్లు కొన్ని ఫన్నీ సంభాషణలను.. డిఫరెంట్ స్టైల్‌లో వ్రాయడం విశేషం. 

అలాగే తొలిసారి నటి సన్ని లియోన్‌కి (Sunny Leone) ఓ తెలుగు సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్ దొరికింది. ఆ పాత్రకు దాదాపు ఆమె న్యాయమే చేసింది. పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput) పాత్ర కూడా సినిమాకు బలాన్నే చేకూర్చింది. 

ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే.. ముందుగా ఫస్ట్, సెకండ్ హాఫ్‌లలో అనుకోకుండా వచ్చే ట్విస్టుల గురించి చెప్పుకోవాలి. ముఖ్యంగా ఇంటర్వెల్‌కు ముందు వచ్చే ట్విస్ట్.. జనాలలో క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది. ఇక చమ్మక్ చంద్ర, వెన్నెల కిషోర్ పాత్రలు కూడా సందర్భోచిత హాస్యంతో సినిమాలో నవ్వులు పూయించారు. 

ప్రతికూల అంశాలు
ఈ సినిమాకి ప్రధానమైన మైనస్ పాయింట్ స్లో నేరేషన్. దర్శకుడు కథలోకి వెళ్లడానికి చాలా టైమ్ తీసుకుంటాడు. కొన్నిసార్లు అది ప్రేక్షకుడికి బోర్ కొట్టేలా చేస్తుంది. అయితే ఈ గ్యాప్‌‌ను కామెడీతో కవర్ చేయడానికి ప్రయత్నించారేమో అని కూడా మనకు అనిపించక మానదు. 
 
టెక్నికల్ టీమ్

ఈ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోరుని అందించిన అనూప్ రూబెన్స్ మంచి ఔట్‌పుట్ ఇచ్చాడు. అలాగే చోటా కే నాయుడు సినిమాటోగ్రఫీ కూడా సినిమాకి ప్లస్ అయ్యింది. 

ఇక నిర్మాణ విలువలు బాగున్నాయి. అయితే సినిమాను ఎందుకు అర్థాంతరంగా ముగించారో సగటు ప్రేక్షకుడికి అర్థం కాదు. బహుశా పార్ట్ 2 తీసే ఆలోచనతో దర్శకుడు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా అని మనకు అనిపించక మానదు. 
 
ఫైనల్ వర్డ్
కామెడీ చిత్రాలను ఇష్టపడేవారిని మాత్రం "జిన్నా" నిరుత్సాహానికి గురిచేయడు. 

Read More: నాపై ట్రోలింగ్ చేయిస్తున్న ఆ బడా హీరో ఎవరనేది అందరికీ తెలుసు: మంచు విష్ణు

Advertisement
Credits: Instagram

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!