Naga Chaitanya: నాగచైతన్య హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో .. కొత్త చిత్రం NC22 షూటింగ్ రేపటి నుండే ప్రారంభం !

Updated on Sep 20, 2022 07:22 PM IST
నాగచైతన్య 'జోష్' చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఏ మాయ చేసావే, 100 % లవ్,  మజిలీ చిత్రాలు తనకు మంచి పేరు తీసుకొచ్చాయి.
నాగచైతన్య 'జోష్' చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఏ మాయ చేసావే, 100 % లవ్, మజిలీ చిత్రాలు తనకు మంచి పేరు తీసుకొచ్చాయి.

నాగచైతన్య (Naga Chaitanya) ... అక్కినేని వారసుడిగా సుపరిచితుడు. 'జోష్' చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య ఆ తర్వాత 'ఏ మాయ చేశావె' చిత్రంతో తొలి సక్సెస్ పొందాడు. 

ఆ తర్వాత ఆటో నగర్ సూర్య, 100 % లవ్, మజిలీ, ప్రేమమ్ లాంటి చిత్రాలు చైతూకి మంచి పేరు తీసుకొచ్చాయి. తాజాగా తన తాతయ్య అక్కినేని నాగేశ్వరరావు జయంతిని పురస్కరించుకొని నాగచైతన్య (Naga Chaitanya), తన కొత్త సినిమాని అనౌన్స్ చేశాడు. 

దర్శకుడిగా వెంకట్ ప్రభు

వెంకట్ ప్రభు (Venkat Prabhu) డైరెక్షన్‌లో NC22 చిత్రం, నాగచైతన్య హీరోగా రేపటి నుండే ప్రారంభం కానుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టరుని మేకర్స్ ఈ రోజే విడుదల చేశారు. తమిళ, తెలుగు భాషలలో తెరకెక్కే ఈ సినిమా షూటింగ్ రేపటి నుండే మొదలు కానుంది. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. ఈ చిత్రంలో కృతి శెట్టి కథానాయికగా నటిస్తున్నారు. 

ఇళయరాజా, యువన్ శంకర్ రాజా కాంబినేషన్

ఈ చిత్రానికి ఇళయరాజా తన తనయుడు యువన్ శంకర్ రాజాతో కలిసి సంయుక్తంగా సంగీతాన్ని అందిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై అభిమానులకు ఇంకా ఆసక్తి పెరిగింది. రేపు రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా తొలి షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది.  ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ అంతర్జాలంలో వైరల్‌గా మారింది. 

పూర్తి నయా లుక్‌తో, రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషనులో చాలా డిఫరెంట్‌గా ఉంది ఈ సినిమా పోస్టర్. శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అబ్బూరి రవి ఈ సినిమాకి సంభాషణలు అందిస్తున్నారు. 

చెన్నై 600028, సరోజా, గోవా, బిర్యాని, పార్టీ, మానాడు, లైవ్ టెలికాస్ట్, విక్టిమ్ లాంటి సినిమాలు వెంకట్ ప్రభుకి తమిళంలో మంచి పేరు తీసుకొచ్చాయి. తెలుగులో ఈయన తొలిసారిగా నాగచైతన్యతో చేస్తున్న విభిన్న ప్రయోగమే ఈ NC22.

Read More: నెపోటిజంపై నాగచైతన్య సంచలన వ్యాఖ్యలు.. ఇంతకీ ఏమన్నాడంటే?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!