ఎయిర్ పోర్టులో అఖిల్ అక్కినేని (Akhil Akkineni)

Published on Apr 23, 2022 11:53 PM IST

అక్కినేని అఖిల్ (Akkineni Akhil).. ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున పుత్రరత్నం. అఖిల్ అనే చిత్రంతో తెలుగు తెరకు హీరోగా పరిచయమైన ఈ నటుడు.. బాలనటుడిగా సిసింద్రీ చిత్రం ద్వారా కూడా తెలుగువారికి సుపరిచితుడే. హలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ అనేవి ఈయన నటించిన ఇతర చిత్రాలు.

ప్రస్తుతం ఏజెంట్ చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నారు అఖిల్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో మమ్ముట్టి, సాక్షి వైద్య నటిస్తున్నారు. వక్కంతం వంశీ కథను సమకూరుస్తున్నారు. సుంకర రామబ్రహ్మం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. హిప్ హాప్ తమీజీ సంగీతాన్ని అందిస్తున్నారు.

స్పై ధ్రిల్లర్ జానర్‌లో ప్రేక్షకులకు కనువిందు చేయడానికి వస్తోంది ఈ చిత్రం. ఆగస్టు 12 వ తేదిన ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు