అఖిల్ అక్కినేని (Akkineni Akhil) ఏజెంట్ సినిమా షూటింగ్‌ లేట్ కావడానికి అసలు కారణం ఏమిటో..?

Updated on Aug 18, 2022 10:14 PM IST
అఖిల్ అక్కినేని (Akkineni Akhil) ఏజెంట్ సినిమా షూటింగ్ లేట్ కావడానికి సురేందర్‌‌ రెడ్డి కూడా కారణమని సమాచారం
అఖిల్ అక్కినేని (Akkineni Akhil) ఏజెంట్ సినిమా షూటింగ్ లేట్ కావడానికి సురేందర్‌‌ రెడ్డి కూడా కారణమని సమాచారం

సరైన హిట్ కోసం  హీరో అక్కినేని అఖిల్ (Akkineni Akhil) ఎంతగానో ఎదురుచూస్తున్నారు. రీసెంట్ గా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ సినిమాతో ఒక మోస్తరు హిట్ అందుకున్నారు అఖిల్. పాన్ ఇండియా మార్కెట్‌ని టార్గెట్ చేస్తూ అఖిల్‌ నటిస్తున్న సినిమా ఏజెంట్.  స్టైలిష్ ఫిల్మ్‌ మేకర్ గా పేరున్న సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని సెప్టెంబర్ 2020లో అనౌన్స్ చేశారు.  జూలై 2021లో సెట్స్ పైకి వెళ్లిన ఏజెంట్‌ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యి 13 నెలలు పూర్తయ్యింది. ఈ సమయంలో ఒక సినిమా  కంప్లీట్ చేసుకొని రిలీజ్ కూడా అయిపోయేది. కానీ ఏజెంట్ సినిమా ఏడాది కాలంలో  60 రోజులు మాత్రమే షూటింగ్ జరుపుకుంది. ఇంకా 70 రోజుల వరకూ షూటింగ్  బ్యాలెన్స్ ఉందని సమాచారం. 

రీసెంట్‌గా ‘ఏజెంట్’ సినిమా టీజర్ రిలీజై  మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ పాజిటివ్ బజ్‌ని  కాపాడుకుంటూ ట్రెండ్‌లో ఉండగానే  సినిమా షూటింగ్‌ను పూర్తి చేసి రిలీజ్ చేస్తే కలెక్షన్లు బాగుంటాయి. అయితే సినిమా షూటింగ్‌ చాలా రోజులుగా డిలే అవుతోంది. దీనికి కారణాలు ఏమిటనేది ఆరా తీస్తే చాలా విషయాలే బయటకు వస్తున్నాయి. 

అఖిల్ అక్కినేని (Akkineni Akhil) ఏజెంట్ సినిమా షూటింగ్ లేట్ కావడానికి సురేందర్‌‌ రెడ్డి కూడా కారణమని సమాచారం

రూమర్స్‌ చాలానే..

కొన్ని రోజుల క్రితం హీరో అండ్ డైరెక్టర్‌కి మధ్య అభిప్రాయబేధాలు వచ్చాయని రూమర్స్ వచ్చాయి.  ఆ తర్వాత మమ్ముట్టి  డేట్స్ అడ్జస్ట్‌ కావడం లేదని కొన్ని వార్తలు హల్‌చల్‌ చేశాయి.  ఏజెంట్‌ సినిమా
షూటింగ్‌ డిలే అవుతుండడానికి ఇప్పుడు మరో కారణం బయటకు వచ్చింది. ఆ కారణం పేరు సురేందర్ రెడ్డి. ‘సైరా’ సినిమా రిజల్ట్‌తో నిరాశచెందిన సురేందర్ రెడ్డి ఆసక్తి మొత్తం బిజినెస్‌పైనే ఉందని,  అందుకే ఏజెంట్ సినిమా షూటింగ్‌ లేట్ అవుతోందని టాక్ వినిపిస్తోంది.  ఇక అఖిల్‌ (Akkineni Akhil) ఎన్నో ఆశలు పెట్టుకుని చాలా కష్టపడి నటిస్తున్న సినిమా ఏజెంట్. ఈ సినిమా షూటింగ్  కంప్లీట్ కాకముందే  మేకర్స్  రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేశారు. ఇప్పటికే రెండుసార్లు సినిమా రిలీజ్‌ డేట్స్‌ అనౌన్స్‌ చేసినా సినిమా మాత్రం రిలీజ్ కాలేదు. చూడాలి మరి సినిమా షూటింగ్‌ ఎప్పుడు పూర్తై రిలీజ్ అవుతుందో. ఇక, మరో పక్క సినిమా షూటింగ్‌ డిలేకు కారణాలు కరెక్టా కాదా అనే విషయాలపై కూడా క్లారిటీ లేదు.

Read More : Agent : ఏజెంట్ మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్కినేని అఖిల్ సినిమా పై అభిమానులలో భారీ అంచనాలు !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!