నా కండీష‌న్సే.. నీ కిష్ట‌మైతే.. ఇంకా వ‌చ్చేయి అంటున్న గోపిచంద్ (Gopichand)

Updated on Jun 01, 2022 08:14 PM IST
గోపిచంద్ (Gopichand)  న‌టించిన ప‌క్కా క‌మ‌ర్షియల్ సినిమా నుంచి అందాల రాశి లిరిక‌ల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు.
గోపిచంద్ (Gopichand) న‌టించిన ప‌క్కా క‌మ‌ర్షియల్ సినిమా నుంచి అందాల రాశి లిరిక‌ల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు.

టాలీవుడ్‌లో త‌న‌కంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న న‌టుడు గోపిచంద్  (Gopichand). ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ సినిమాతో (Pakka Commercial) త‌ర్వ‌లో గోపిచంద్ ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. మారుతి  ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న ప‌క్కా క‌మ‌ర్షియల్ సినిమాలో గోపిచంద్‌కు జోడిగా రాశిఖ‌న్నా న‌టిస్తున్నారు. ఈ సినిమా నుంచి అందాల రాశి లిరిక‌ల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. 

అందాల రాశి పాట‌లో గోపిచంద్ (Gopichand) చాలా స్టైలిష్‌గా క‌నిపించారు. సాంగ్ కోసం వేసిన సెట్టింగ్స్ కూడా బాగున్నాయి. గోపిచంద్ వేసిన డాన్సులు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. కోర్టు సెట్టింగ్‌లో మాస్ స్టెప్పుల‌తో గోపిచంద్, రాశి అద‌ర‌గొట్టేశారు.అందాల రాశీ..మేక‌ప్ ఏసి నాకోస‌మొచ్చావే..స్వ‌ర్గంలో కేసే నా మీదేసి..భూమ్మీద మూసావే..’ అంటూ ఈ పాట‌ సాగుతుంది. మాస్ సాంగ్‌గా కూల్ ట్యూన్‌తో అందాల రాశి పాట అద‌ర‌గొడుతుంది. జేక్స్ బిజోయ్ అందాల రాశి పాట‌ను కంపోజ్ చేశారు. కృష్ణ‌కాంత్ ఈ పాట‌ను రాశారు. సాయిచ‌ర‌ణ్ భాస్క‌రుణి, ర‌మ్య బెహెరా అందాల రాశి సాంగ్‌ను పాడారు.

గీతాఆర్ట్స్ 2 పిక్చ‌ర్స్, యూవీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్లపై ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ సినిమా నిర్మించారు. బ‌న్నీవాసు, వీ వంశీ కృష్ణా రెడ్డి, ప్ర‌మోద్ ఉప్ప‌ల‌పాటి నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కామెడీ ఎంట‌ర్ టైన‌ర్‌గా ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్  (Pakka Commercial) తెర‌కెక్కుతుంది. ఈ సినిమాలో స‌త్య‌రాజ్‌, అన‌సూయ భ‌రద్వాజ్‌, రావు ర‌మేశ్‌, స‌ప్త‌గిరి, సాయికృష్ణ‌, ర‌మ‌ణారెడ్డి ప్ర‌ధాన పాత్రల్లో న‌టిస్తున్నారు. క‌రోనా కార‌ణంగా సినిమా అనుకున్న తేదీ క‌న్నా లేటుగా రిలీజ్ చేస్తున్నారు. గోపిచంద్ (Gopichand) 29వ సినిమా ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ 2022 జులై 1 న థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!