'సీతారామం' (SitaRamam) @ 50 రోజులు.. స్పెష‌ల్ పోస్ట‌ర్ రిలీజ్ చేసిన మేక‌ర్స్

Updated on Sep 23, 2022 01:45 PM IST
 'సీతారామం' (Sita Ramam) తెలుగు, త‌మిళ, మ‌ల‌యాళ భాష‌ల్లో స‌క్సెస్ ఫుల్‌గా 50 రోజులు పూర్తి చేసుకుంది.
'సీతారామం' (Sita Ramam) తెలుగు, త‌మిళ, మ‌ల‌యాళ భాష‌ల్లో స‌క్సెస్ ఫుల్‌గా 50 రోజులు పూర్తి చేసుకుంది.

టాలీవుడ్‌ బ్లాక్ బాస్ట‌ర్ హిట్ సాధించిన సినిమాల్లో ‘సీతారామం’ (Sita Ramam) మ‌రో రికార్డును బ్రేక్ చేసింది. ఈ సినిమా విడుద‌లై 50 రోజులు పూర్తి చేసుకుంది. 'యుద్ధంతో రాసిన ప్రేమ క‌థ' అనే హ్యాష్ ట్యాగ్‌కు త‌గ‌ట్టుగానే ద‌ర్శ‌కుడు హ‌ను రాఘ‌వ‌పూడి ఈ సినిమాను చిత్రీక‌రించారు. రామ్‌గా దుల్క‌ర్ స‌ల్మాన్.. సీత‌గా మృణాల్ ఠాకూర్ న‌టించి ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌లు అందుకున్నారు. హీరోయిన్ ర‌ష్మిక మంద‌న్న కూడా ఈ సినిమాలో అద్భుత‌మైన న‌ట‌న క‌న‌బ‌రిచారు. సుమంత్, తరుణ్ భాస్కర్ కీలక పాత్ర‌ల్లో క‌నిపించారు.

50 డేస్ పోస్ట‌ర్

వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా బ్యానర్‌‌పై నిర్మాత‌ అశ్వినీదత్ 'సీతారామం' సినిమాను నిర్మించారు. మ‌ల‌యాళ స్టార్ హీరో దుల్క‌ర్ స‌ల్మాన్, మృణాల్ ఠాకూర్ జంట‌గా న‌టించిన 'సీతారామం' చిత్రం ఆగ‌స్టు 5 తేదిన విడుద‌లైంది. ఈ సినిమా రిలీజ్ అయిన తొలి రోజు నుంచే థియేట‌ర్ల‌ను షేక్ చేస్తోంది. తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళ భాష‌ల్లో సూపర్ డూప‌ర్ హిట్‌గా నిలిచింది.

ఈ సినిమాను ఇటీవలే హిందీలో డ‌బ్ చేసి రిలీజ్ చేశారు. బాలీవుడ్‌లోనూ 'సీతారామం' సినిమా క‌లెక్ష‌న్ల సునామీ సృష్టించింది.  'సీతారామం' (Sita Ramam) తెలుగు, త‌మిళ, మ‌ల‌యాళ భాష‌ల్లో స‌క్సెస్ ఫుల్‌గా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ నేప‌థ్యంలో మేక‌ర్స్ స్పెష‌ల్ పోస్ట‌ర్ రిలీజ్ చేశారు. 

క‌లెక్ష‌న్ల జోరు

'సీతారామం' చిత్రం తెలుగు రాష్ట్రాల్లో కోట్ల రూపాయ‌ల‌ను కొల్ల‌గొడుతోంది. రోజు రోజుకు క‌లెక్ష‌న్ పెరుగుతూ వ‌స్తుంది. 'సీతారామం' విడుద‌లై 50 రోజులు కావ‌స్తున్నా.. క‌లెక్ష‌న్ల హ‌వా ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. చాలా రోజుల త‌రువాత ఓ మంచి ప్రేమ‌క‌థా చిత్రం చూశామ‌ని ప్రేక్ష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. విశాల్ చంద్రశేఖర్ అందించిన సంగీతం ఈ సినిమాకు మ‌రో ప్ల‌స్ పాయింట్‌గా మారింది. అనంత శ్రీరామ్ రాసిన పాట‌లు ప్రతీ ఒక్క‌రి మ‌న‌సును తాకాయి.

Read More: Sita Ramam: 'సీతారామం' చూడ చ‌క్క‌ని ప్రేమ కావ్యం.. జాతీయ స్థాయిలో అవార్డులు అందుకోవాలి - చిరంజీవి (Chiranjeevi)

 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!