సంక్రాంతి బరిలో విజయ్ (Hero Vijay)-వంశీ పైడిపల్లి సినిమా 'వారసుడు' (Varasudu).. అధికారిక ప్రకటన వచ్చేసింది!
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ (Vijay) నటిస్తోన్న తొలి తెలుగు సినిమా 'వారసుడు' (Vaarasudu). శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్ గా నటిస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఫామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. వంశీ పైడిపల్లి (Vamsi Paidipally) దర్శత్వంలో సినిమా తెరకెక్కుతోంది.
'వారసుడు' (Vaarasudu) కార్తీక్ పళని ఫోటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాలో రాధికా శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, ప్రభు, శ్రీకాంత్, యోగి బాబు, జయసుధ, సంగీత క్రిష్, ఖుష్బూ తదితరులు ఇతర పాత్రలు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. 'వారసుడు' (Vaarasudu Update) మూవీ రిలీజ్‌కు సంబంధించి మేకర్స్ తాజాగా బిగ్ అప్‌డేట్ ఇచ్చారు. శనివారం (సెప్టెంబర్ 24) ఈ మూవీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ తన అధికారిక ట్విటర్‌లో మూవీ షూటింగ్, రిలీజ్‌కు సంబంధించి కీలకమైన విషయాలను చెప్పింది. ఈ ద్విభాషా చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారట మేకర్స్.
అయితే, ఇటీవల ఈ సినిమా షూటింగ్‌ను ఆపేశారంటూ వార్తలు నెట్టింట వినిపించాయి. కానీ ఫిలింనగర్ సినీ వర్గాల్లో వినిపిస్తున్నవార్తల మేరకు.. వారసుడు సినిమా అనుకున్న ప్లానింగ్ ప్రకారమే పూర్తవుతుందట. ఇంకా ఈ సినిమాలో రెండు ఫైట్స్, రెండు సాంగ్స్ చిత్రీకరణ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. నెక్ట్స్ షెడ్యూల్‌లో ఈ బ్యాలెన్స్ పార్ట్‌ను పూర్తి చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.
కాగా, ఇప్పటికే 'వారసుడు' ఫస్ట్ లుక్ (Varasudu First Look) రిలీజైంది. విజయ్ 48వ పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చారు. అయితే, విజయ్‌కు ఇది 66వ సినిమా కావడం విశేషం. ఇక, ఈ మధ్య కాలంలో విజయ్ సినిమాలేవీ సంక్రాంతికి రిలీజ్ కాలేదు. ఇప్పుడు ఈ అనౌన్స్‌మెంట్‌తో అతని ఫ్యాన్స్‌కు ముందే పండగ వచ్చేసినట్లయింది.