పెళ్లి పీటలెక్కనున్న హన్సిక (Hansika Motwani).. రాచకోటలో వైభవంగా వివాహ వేడుక
బాలనటిగా చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చి.. దక్షిణాదిన అగ్ర నటిగా ఎదిగిన హన్సికా మోత్వాని (Hansika Motwani) వివాహ వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తన అందం, అభినయంతో కుర్రకారును ఫిదా చేసిన ఈ యాపిల్ బ్యూటీ త్వరలో పెళ్లి కూతురు కాబోతున్నారు. తన మ్యారేజ్ గురించిన కబుర్లను హన్సిక ఓ మీడియా సంస్థతో పంచుకున్నారు. జైపూర్‌లోని 450 ఏళ్ల పురాతన రాచకోటలో తన వివాహ వేడుక గ్రాండ్‌గా జరగనుందని ఆమె తెలిపారు.
‘ముందోతా ఫోర్ట్ ప్యాలెస్‌లో నా పెళ్లి జరగనుంది. ఈ వేడుకకు వచ్చే అతిథులకు రాచమర్యాదలు దక్కేలా ఏర్పాట్లు చేస్తున్నాం’ అని ఆ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హన్సిక వెల్లడించారు. డిసెంబర్‌లో జరగనున్న ఈ వేడుక కోసం రాచకోటలోని ఓ హోటల్‌లో ఉన్న అన్ని గదులు, సూట్లను బుక్ చేసినట్లు సమాచారం. మొన్నటివరకు ఇప్పుడప్పుడే పెళ్లెందుకు అంటూ మాట దాసేస్తూ వచ్చిన హన్సిక.. మొత్తానికి గుడ్ న్యూస్ చెప్పారు.
ఇక, హన్సిక కెరీర్ విషయానికొస్తే.. చేతినిండా చిత్రాలతో ఆమె బిజీబిజీగా ఉన్నారు. తెలుగు, తమిళంలో కలిపి దాదాపు పది చిత్రాల్లో హన్సిక నటిస్తుండటం విషయం. వర్క్ విషయంలో ఫుల్ హ్యాపీగా ఉన్న హన్సిక (Hansika Motwani Marriage).. ఇపుడు తన వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే పెళ్లికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. మ్యారేజ్‌కు ఇంకా సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే ప్లాన్లు వేస్తున్నారు. అయితే హన్సిక వివాహ తేదీతో పాటు ఆమెను పెళ్లాడబోయే వరుడు ఎవరనేది ఇంకా తెలియరాలేదు. ఈ విషయంపై హన్సిక స్పందించే వరకు ఆగాల్సిందే!
కాగా, చిత్ర పరిశ్రమలో హన్సిక హాఫ్ సెంచరీ కొట్టేశారు. ఇప్పటివరకు ఆమె 50కి పైగా మూవీల్లో ఆమె నటించారు. మరో పది సినిమాల్లో ప్రస్తుతం యాక్ట్ చేస్తున్నారు. కెరీర్ పీక్స్‌లో ఉండగానే తమిళ స్టార్ హీరో శింబుతో హన్సిక ప్రేమాయణం నడిపారు. వీళ్లిద్దరూ పెళ్లితో ఒక్కటవుతారని అందరూ అనుకున్నారు. అయితే వీరి ప్రేమ.. పెళ్లి పీటల వరకు వెళ్లలేదు. శింబుకు బ్రేకప్ చెప్పిన తర్వాత హన్సిక కెరీర్ గ్రాఫ్ తగ్గుతూ వచ్చింది. అయినా సినీ అవకాశాలు మాత్రం తగ్గలేదు. సోలో హీరోయిన్‌గా ఫిమేల్ సెంట్రిక్ కథలతో హన్సిక సినిమాలు చేస్తూ వచ్చారు.