పెళ్లికి అప్పుడే టైం కాలేదంటున్న హ‌న్సికా మోత్వానీ (Hansika Motwani) .. హాఫ్ సెంచ‌రీ కొట్టబోతున్న బ్యూటీ!

Updated on Jul 13, 2022 04:49 PM IST
హన్సికా మోత్వానీ(Hansika Motwani)
హన్సికా మోత్వానీ(Hansika Motwani)

తెలుగులోనే కాకుండా త‌మిళంలోనూ వ‌రుస సినిమాలు చేస్తూ, త‌న‌కంటూ స్పెషల్ ఇమేజ్ సాధించిన హీరోయిన్‌ హన్సికా మోత్వానీ (Hansika Motwani).  గ్లామర్ క్యారెక్టర్స్ నుంచి లేడీ ఓరియెంటెడ్ పాత్రల వైపు మళ్లిన ఈ బ్యూటీ నటించిన మొద‌టి మ‌హిళా ప్రధాన చిత్రం  'మహా'. ఈ సినిమాతో హన్సికా.. 50 సినిమాల మార్కును క్రాస్ చేయబోతోంది. 

త్వరలోనే హాఫ్ సెంచరీ సినిమా మార్క్ దాటబోతున్న ఈ హాట్ బ్యూటీ మీడియాతో ముచ్చటించింది. పెళ్ళితో పాటు ..ఇతర విషయాలను కూడా పంచుకుంది.

అల్లు అర్జున్ దేశముదురు సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు హన్సిక.  ప్రస్తుతం 'మహా' చిత్రంలో నటిస్తున్నారు. ఎక్స్‌ట్రా ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై వి.మదియళగన్‌ నిర్మించిన ‘మహా’ సినిమాకు యూఆర్‌ జమీల్‌ దర్శకత్వం వహించారు. తమిళ క్రేజీ స్టార్ హీరో  శింబు ఈ సినిమాలో  ప్రత్యేక పాత్రలో నటించారు. ఇక ఎంత వీలైతే అంత త్వరగా, ఈ సినిమాను రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు మేకర్స్‌. ఈ క్రమంలో హీరోయిన్ హన్సిక మీడియాతో మాట్లాడారు. 

హన్సికా మోత్వానీ(Hansika Motwani) మహా సినిమా పోస్టర్

కరోనా కూడా కారణం

సినిమాలకు గ్యాప్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయనీ,  కరోనా కూడా ఒక కారణమంటోంది హ‌న్సిక‌. 'కరోనా టైమ్‌లోనే కెరీర్ కాస్త వెనకబడింది. మామూలుగా అయితే నేను ఎప్పుడూ ఖాళీగా ఉండను. ఏదో ఒక పని చేస్తునే ఉంటాను' అంటూ లాక్‌డౌన్ క‌ష్టాల‌ను గుర్తుచేసుకుందీ ఈ ముంబై బ్యూటీ. విరామం లేని ప‌నే త‌న‌కు మ‌రింత శ‌క్తినిస్తూ, ప‌ట్టుద‌ల పెంచుతుందని  చెప్పుకొచ్చింది.

'50 సినిమాలు చేశారు.. ఇక పెళ్ళి ఎప్పుడు' అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ..  'ప్రస్తుతం సినిమాలు చేసుకుంటూ.. పనిలో జీవితాన్ని వెతుక్కుంటున్నా.  సంతోషంగా ఉన్నా. ఇప్పటికి వర్క్‌తోనే నా పెళ్లి. టైం వచ్చినప్పుడు దాని గురించి ఆలోచిస్తాను' అంటూ  ఇప్పట్లో పెళ్లి ఆలోచ‌న లేద‌ని చెప్పకనే చెప్పేసింది హ‌న్సిక‌.

హన్సికా మోత్వానీ(Hansika Motwani) మహా సినిమా పోస్టర్

చాలా కారణాలున్నాయి..

"మహా సినిమాను సెలక్ట్ చేసుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఈ సినిమా కథ చాలా ప్రత్యేకం, కథ న‌న్ను బాగా ఇంప్రెస్ చేసింది. అంతే కాదు,, నేను నటిస్తున్న ఫస్ట్ లేడీ ఓరియెంటెడ్ సినిమా. అందులోను నా 50వ సినిమా కావడంతో ఈ  సినిమా నాకు ఎంతో ప్రత్యేకం" అంటోంది హన్సికా.

అంతే కాదు.. ఈ సినిమాలో మరో ప్రత్యేకత ఏంటీ అంటే.. ఇప్పటి వరకూ గ్లామర్ పాత్రలకు పరిమితం అయిన హన్సిక, ఇందులో ఒక బిడ్డకు తల్లిగా నటించింది.  ఎన్నో కష్టాలను ఎదుర్కొనే పాత్ర అది.

'నేను ఇంత వరకు చేయనటువంటి పాత్ర. నటనకు అవకాశం ఉన్న పాత్ర. అందులోనూ అన్ని రకాల ఎమోషన్స్‌ ఉన్న పాత్ర కావడంతో ఈ సినిమాను అంగీకరించా' అని అంటోంది హన్సిక మోత్వాని.

'సినిమా బాగా వచ్చింది. ఇది అందరూ మెచ్చే  సినిమా అవుతుంది' అని కూడా తెలిపింది హన్సిక. ఈ క్యారెక్టర్ తనకు చాలా ఛాలెంజింగ్ అనిపించిందని.. అందుకే పట్టు బట్టి..  ఈ పాత్రకు న్యాయం చేశానని' కూడా అభిప్రాయపడింది ఈ బ్యూటీ. అలాగే తన సినీ కెరీర్‌‌లో ఈ సినిమా నిలిచిపోతుంద‌ని కూడా  ధీమా వ్యక్తం చేస్తోంది ఈ అందాల తార.

తెలుగులో ప్రభాస్ నటించిన 'బిల్లా', ఎన్టీఆర్‌‌ సరసన 'కంత్రీ', సిద్దార్ధ్‌ హీరోగా వచ్చిన 'ఓ మై ఫ్రెండ్' సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు హన్సిక. కరోనా గ్యాప్‌ను కవర్ చేయడం కోసం, ఈ ఏడాది వరుసగా సినిమాలు సైన్ చేస్తోంది ఈమె. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో కలిపి 10  సినిమాలు  చేస్తూ.. గ్యాప్ లేకుండా షూటింగుల్లో పాల్గొంటూ ఆ సినిమాలు కంప్లీట్ చేసే పనిలో పడింది హ‌న్సిక‌ (Hansika Motwani).

Read More : New Movies : ఈ వారం థియేటర్లలో సందడి చేయనున్న కొత్త సినిమాలు.. రామ్‌ ‘ది వారియర్’, సాయి పల్లవి ‘గార్గి’

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!