Happy Birthday Amma : "ఆమెను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా" అంటూ మహేష్ ఎమోషనల్ పోస్ట్
అతనో సూపర్‌స్టార్.. సినిమా షూటింగ్‌లతో ఎప్పుడూ బిజీబిజీగా ఉంటాడు. అయితేనేం.. ప్రొఫెషన్‌కు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో.. ఫ్యామిలీకి కూడా అంతే ప్రాధాన్యం ఇస్తాడు. అతనే సూపర్‌స్టార్ మహేష్‌బాబు. ఈ రోజు మహేష్ తల్లి ఇందిరాదేవి పుట్టినరోజు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే సూపర్‌స్టార్.. తన తల్లికి బర్త్డే విషెస్ చెబుతూ ఎమోషనల్‌గా పోస్ట్ చేశాడు. తనను ఎప్పుడూ ఆశీర్వదిస్తున్న తల్లికి ధన్యవాదాలు అని ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. అమ్మను ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటానని, ఆమెపై ఉన్న ప్రేమను చెప్పడానికి జీవితంలో ఒక్కరోజు సరిపోదని మహేష్ అన్నాడు.
మహేష్ పోస్ట్ చూసిన ఫ్యాన్స్ ఆయనకు తల్లిపై ఉన్న ప్రేమకు ఫిదా అవుతున్నారు. తల్లి ఇందిరా దేవి పుట్టినరోజు సందర్భంగా మహేష్ లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ మూడో పాటకు సంబంధించిన అప్‌డేట్ రానున్నట్టు తెలిసింది.