సమంత (Samantha) యాటిట్యూడ్‌, మాటలకు అక్షయ్‌ కుమార్ ఫిదా? తన పక్కన నటించే చాన్స్‌ ఇచ్చేశారా!

Updated on Jul 27, 2022 06:20 PM IST
బాలీవుడ్ స్టార్‌‌ హీరో అక్షయ్ కుమార్‌‌తో స్క్రీన్ షేర్ చేసుకునే చాన్స్ కొట్టేసిన సమంత (Samantha)
బాలీవుడ్ స్టార్‌‌ హీరో అక్షయ్ కుమార్‌‌తో స్క్రీన్ షేర్ చేసుకునే చాన్స్ కొట్టేసిన సమంత (Samantha)

తక్కువ కాలంలోనే స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిన వారిలో సమంత (Samantha) ఒకరు. మనోజ్‌ బాజ్‌పాయ్‌ నటించిన 'ది ఫ్యామిలీ మ్యాన్‌ 2' వెబ్‌ సిరీస్‌తో మరింత క్రేజ్ సంపాదించుకున్నారు. 'పుష్ప: ది రైజ్‌' సినిమాలోని 'ఊ అంటావా మావా' సాంగ్‌తో పాన్‌ ఇండియా లెవెల్‌లోనూ పేరు తెచ్చుకున్నారు సమంత.

 ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు సామ్. ప్రస్తుతం సామ్ చేతిలో అరడజనుకుపైగా ప్రాజెక్ట్స్‌ ఉన్నట్లు సమాచారం. వీటిలొ బాలీవుడ్‌, హాలీవుడ్‌ సినిమాలు కూడా ఉన్నాయి. అయితే తాజాగా సమంత మరో హిందీ సినిమాలో చాన్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది.  

కాఫీ విత్ కరణ్‌ షోలో అక్షయ్ కుమార్‌‌తో హీరోయిన్ సమంత (Samantha)

అక్షయ్‌ ఫిదా..

బాలీవుడ్‌ పాపులర్ షో 'కాఫీ విత్ కరణ్‌' టాక్‌ షోలో సమంత ఇటీవల సందడి చేశారు. ఇందులో సామ్‌ అందచందాలతో అదరగొట్టడమే కాకుండా, ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సమంతతోపాటు బాలీవుడ్ యాక్షన్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ కూడా షోలో పాల్గొన్నారు. ఈ షోలో సమంత యాటిట్యూడ్‌, సమయస్ఫూర్తితో చెప్పిన సమాధానాలకు అక్షయ్ కుమార్‌‌ ఫిదా అయ్యారని టాక్. దీంతో తన తర్వాతి సినిమాలో సమంతకు చాన్స్‌ ఇచ్చినట్లు బాలీవుడ్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఇదివరకే ‘ది ఫ్యామిలీ మ్యాన్‌2’ సిరీస్‌లో నటించిన సామ్‌ పాపులారిటీ ఓ రేంజ్‌కు పెరిగింది. ఒకవేళ అక్షయ్ కుమార్‌ సినిమాలో సమంతకు నటించే చాన్స్‌ వచ్చిన వార్తలు నిజమైతే ఆమె రేంజ్ మరింతగా పెరిగినట్టేనని అనుకుంటున్నారు అభిమానులు. ప్రస్తుతం హిందీలో వరుణ్‌ ధావన్‌తో సమంత (Samantha) సినిమా చేస్తున్నారు.

Read More : మరో ఐటం సాంగ్‌లో టాలీవుడ్ బ్యూటీ సమంత (Samantha).. ఈసారి బాలీవుడ్‌లో చాన్స్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!