ట్వీట్‌పై నెటిజన్ విమర్శలు.. తనదైన స్టైల్‌లో రిప్లై ఇచ్చిన హీరోయిన్ సమంత (Samantha)
స్టార్ హీరోయిన్ సమంత (Samantha) చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. అదే సమయంలో సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటోంది. తనకు సంబంధించిన ప్రతి విషయాన్నీ షేర్ చేస్తూ మోటివేషనల్ కొటేషన్స్ పోస్ట్ చేస్తూంటుంది. ఇక, సమంతకు పెట్స్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాటికి సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మురిసిపోతుంది. తాజాగా వాటితో దిగిన ఫొటోను ట్విటర్‌లో షేర్ చేసింది సమంత. ఇది చూసిన ఓ నెటిజన్ సామ్‌ను కామెంట్ చేస్తూ రిప్లై ఇచ్చాడు.
ఆ నెటిజన్ చేసిన కామెంట్లకు సమంత కూడా ఘాటుగానే రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం సమంత ఇచ్చిన రిప్లై నెట్టింట వైరల్ అవుతోంది. ఇటీవల సమంత.. తను పెంచుకునే పిల్లులు, కుక్కలతో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీనికి ఓ నెటిజన్.. ‘తన పెట్స్ కుక్కలు, పిల్లులతో ఆమె ఒంటరిగా చనిపోవాలి’ అని కామెంట్ పెట్టాడు. ఇది చూసిన సమంత వెంటనే అతడి కామెంట్లపై స్పందించింది.
‘అదే జరిగితే నన్ను నేను అదృష్టవంతురాలిగా భావిస్తాను’ అంటూ తన స్టైల్‌లో రిప్లై ఇచ్చింది. ఇది చూసిన సమంత ఫ్యాన్స్, ఫాలోవర్స్ ఆ నెటిజన్‌పై విమర్శలు చేస్తున్నారు. దీంతో అతడు తన కామెంట్‌ను డిలీట్ చేశాడు. కొందరు ఆ నెటిజన్ చేసిన కామెంట్‌ను స్క్రీన్ షాట్ తీసి రీట్వీట్ చేస్తున్నారు. అతడు సటైరికల్‌గా కామెంట్ చేసినప్పటికీ పాజిటివ్‌గా రిప్లై ఇచ్చిందని సమంతపై పలువురు ప్రశంసలు గుప్పిస్తున్నారు. సమంత (Samantha) ప్రస్తుతం ఖుషి, యశోద చిత్రాల షూటింగ్‌తో బిజీబిజీగా ఉంది.