మరోసారి ప్రేక్షకులను అలరించనున్న సీతారామం జోడి.. నందినీరెడ్డి దర్శకత్వంలో దుల్కర్ (Dulqer Salman), మృణాల్!

Updated on Aug 27, 2022 09:15 PM IST
సీతారామంతో  ప్రేక్షకుల మనసు దోచుకున్న దుల్కర్​Dulqer Salman),, మృణాల్​ దర్శకురాలు నందినీ రెడ్డి డైరెక్షన్లో మరోసారి జోడీగా నటించనున్నారు.
సీతారామంతో ప్రేక్షకుల మనసు దోచుకున్న దుల్కర్​Dulqer Salman),, మృణాల్​ దర్శకురాలు నందినీ రెడ్డి డైరెక్షన్లో మరోసారి జోడీగా నటించనున్నారు.

 దుల్కర్ సల్మాన్(Dulqer Salman), బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా సీతారామం. ఆగస్టు 5వ తేదీన విడుదలైన ఈ సినిమా  హిట్ టాక్ సొంతం చేసుకుని భారీ వసూళ్లను కొల్లగొడుతోంది. సీతారామం సినిమా ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైన మృణాల్ ఠాకూర్ తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

ఈ సినిమాలో సీతా మహాలక్ష్మి పాత్రలో నటించిన మృణాల్‌ తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను మైమరిపించింది. ఇక ఈ సినిమాలో రష్మిక, సుశాంత్, తరుణ్ భాస్కర్ కీలకపాత్రలు పోషించారు. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయిలో వసూళ్లు సాధించింది. ఈ సినిమా హిట్ అవ్వడంతో మృణాల్ ఠాకూర్ కి తెలుగులో వరుస ఆఫర్లు వస్తున్నాయి.

సీతారామంతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న దుల్కర్​Dulqer Salman),, మృణాల్​ దర్శకురాలు నందినీ రెడ్డి డైరెక్షన్లో మరోసారి జోడీగా నటించనున్నారు.

ఓ బేబీ తర్వాత..

ప్రముఖ నిర్మాణ సంస్థ స్వప్నాదత్ బ్యానర్ లో రాబోయే లేడీ ఓరియెంటెడ్ సినిమాలో మృణాల్ అవకాశం దక్కించుకుందని సమాచారం. ఈ సినిమాకి టాలీవుడ్ లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో విడుదలైన ఓ బేబీ వంటి సినిమాతో హిట్ అందుకున్న నందిని రెడ్డి తర్వాత చిత్రంలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా కనిపించనున్నట్లు సమచారం.

అయితే ఇప్పటివరకు ఈ సినిమా గురించి అధికారికంగా ప్రకటించలేదు. ఆగస్టు 5వ తేదీన తెలుగులో విడుదలైన సీతారామం సినిమా సెప్టెంబర్ 2న హిందీలో విడుదల కానుంది. తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ సినిమా హిందీలో ఎటువంటి రిజల్ట్ వస్తుందో చూడాలి మరి.

ఇదిలా ఉండగా కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఎన్టీఆర్ 30 సినిమాలో కూడా మృణాల్ ఠాకూర్ అవకాశం దక్కించుకున్నట్లు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటించనున్న ఎన్టీఆర్ 30 సినిమాలో ఇప్పటివరకు హీరోయిన్ ఎవరూ అన్నది క్లారిటీ లేదు. ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపికైనట్టు ఎంతో మంది పేర్లు వినిపించాయి . దుల్కర్ సల్మాన్ ( Dulquer Salman) హీరోగా తెరకెక్కిన సీతారామం సినిమాతో హిట్ అందుకున్న మృణాల్‌ ఠాకూర్ ఎన్టీఆర్ 30 సినిమాలు నటించే అవకాశం అందుకుందని వార్తలు వినిపిస్తున్నాయి.

Read More: కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న దుల్కర్ సల్మాన్ (Dulquer Salman) సీతారామం సినిమా..రూ.60 కోట్ల క్లబ్‌లో చోటు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!