కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న దుల్కర్ సల్మాన్ (Dulquer Salman) సీతారామం సినిమా..రూ.60 కోట్ల క్లబ్‌లో చోటు

Updated on Aug 18, 2022 09:54 PM IST
దుల్కర్ సల్మాన్ (Dulquer Salman) సీతారామం సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు దగ్గరైంది
దుల్కర్ సల్మాన్ (Dulquer Salman) సీతారామం సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు దగ్గరైంది

దుల్కర్ సల్మాన్(Dulquer Salman)  హీరోగా నటించిన సినిమా ‘సీతారామం’. వైజయంతీ మూవీస్ సమర్పణలో అశ్వనీదత్ నిర్మాతగా స్వప్న సినిమా పతాకంపై హను రాఘవపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. 13 రోజుల్లో సీతారామం సినిమా కలెక్షన్లు రాబట్టి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. కేరళ, తెలుగు, తమిళ రాష్ట్రాలతో పాటు ఈ సినిమా 60 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు సమాచారం. ముఖ్యంగా ఓవర్సీస్‌లో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

సీతారామం సినిమా యూఎస్‌లో 1 మిలియన్ డాలర్ వసూళ్లు చేసింది.ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ లెఫ్ట్‌నెంట్ రామ్ పాత్రలో నటించారు.  ఇక  సీత పాత్రను మృణాల్ ఠాకూర్ పోషించారు.  రష్మికా మందాన, సీనియర్ హీరో సుమంత్ కీలకపాత్రల్లో నటించారు.  
తెలుగులో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన సావిత్రి బయోపిక్‌ మహానటిలో నటించారు దుల్కర్. ఈ సినిమాలో ఆయన జెమిని గణేషన్‌ పాత్రలో నటించి  మెప్పించారు.

దుల్కర్ సల్మాన్ (Dulquer Salman) సీతారామం సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు దగ్గరైంది

బిగ్గెస్ట్‌ హిట్‌గా..

మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కొడుకుగా ఇండస్ట్రీకి పరిచయమైన దుల్కర్ సల్మాన్ తక్కువకాలంలోనే హీరోగా తనకంటూ  ప్రత్యేకతను సంపాదించుకున్నారు. దుల్కర్ సల్మాన్ హీరోగా విడుదలైన  సీతారామం సినిమా విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించుకుని దుల్కర్ కెరీర్‌‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. హను రాఘవపూడి తెరకెక్కించిన సీతారామం సినిమాలో ఎలాంటి అసభ్యకర సన్నివేశాలు లేకపోవడంతో పాటు కుటుంబ సమేతంగా ఈ సినిమాను చూస్తున్నారు.

దుల్కర్ సల్మాన్ (Dulquer Salman) హీరోగా నటించిన సీతారామం సినిమాకు  ప్రపంచవ్యాప్తంగా కూడా సూపర్ రెస్పాన్స్ వస్తోంది.  బాక్స్ ఆఫీస్ దగ్గర క్లాసిక్ లవ్ స్టోరీ సీతా రామం బ్రేక్ ఈవెన్‌ని కూడా పూర్తి చేసుకుంది. సీతారామం సినిమా 13వ రోజు కూడా  రూ. 0.93 కోట్ల షేర్ (రూ.2.00 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టింది.

Read More : దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) సీతారామం సినిమా తొమ్మిది రోజుల కలెక్షన్లు ఎంతో తెలుసా?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!