Brahmastra: 'ఆర్ఆర్ఆర్' (RRR) సినిమా రికార్డును 'బ్రహ్మాస్త్రం' బ్రేక్ చేసిందా ?
Brahmastra: పాన్ ఇండియా సినిమాగా 'బ్రహ్మాస్త్రం' (Brahmastra) సెప్టెంబర్ 9వ తేదీన రిలీజ్ కానుంది. 'బ్రహ్మాస్త్రం' సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం భాషల్లో విడుదల కానుంది. 'బ్రహ్మాస్త్రం' రిలీజ్ దగ్గరపడటంతో మేకర్స్ అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్‌ను ఓపెన్ చేశారు. 'బ్రహ్మాస్తం' సినిమా టికెట్ల బుకింగ్ విషయంలో.. 'ఆర్ఆర్ఆర్' రికార్డును బ్రేక్ చేసిందట. మరోవైపు 'బ్రహ్మాస్త్రం' సినిమా రిలీజ్ దగ్గర పడతుండటంతో మేకర్స్ ప్రమోషన్ల జోరు పెంచారు.
స్టార్ నటీనటులతో బ్రహ్మాస్త్రం
అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా 'బ్రహ్మాస్త్రం' తెలుగు వర్షన్‌ను దర్శక దిగ్గజం రాజమౌళి సమర్పిస్తున్నారు. స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్ అండ్ స్టార్‌లైట్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని రూ. 300 కోట్ల బడ్జెట్‌తో నిర్మించాయి. ఈ సినిమాను మొత్తం మూడు భాగాలుగా నిర్మించనున్నారు. మొదటి భాగం 'బ్రహ్మాస్త్రం - శివ' (Brahmastra) పేరుతో రిలీజ్ కానుంది. స్టార్ కపుల్ రణ్‌బీర్ కపూర్, అలియా భట్‌తో పాటు అక్కినేని నాగార్జున, అమితాబ్ బచ్చన్, షారూక్ ఖాన్ మొదలైనవారు ఈ సినిమాలో నటించారు.
కేజీఎఫ్ చాప్టర్ 2 రికార్డును బ్రేక్ చేయనుందా?
'బ్రహ్మాస్త్రం' (Brahmastra) సినిమా ఆన్‌లైన్ టికెట్లు ఇప్పటివరకు లక్షకు పైగా అమ్ముడయ్యాయి. ఈ మధ్య కాలంలో వచ్చిన హిందీ సినిమాలకు ఈ స్థాయిలో టికెట్లు బుక్ అవలేదు. 'ఆర్ఆర్ఆర్',' భూల్ బులయ్యా 2' కంటే ఈ సినిమాకే టికెట్లు ఎక్కువ అమ్ముడవడం విశేషం. అయితే కేజీఎఫ్ చాప్టర్ 2 తో పోల్చుకుంటే.. 'బ్రహ్మాస్త్రం' సినిమా ఆన్‌లైన్ బుక్సింగ్స్‌లో వెనుకబడే ఉంది.
'కేజీఎఫ్ చాప్టర్ 2' హిందీ సినిమాకు ఏకంగా 5.05 లక్షల టికెట్లు ఆన్‌లైన్‌లో అమ్ముడయ్యాయి. 'కేజీఎఫ్ చాప్టర్ 2' రికార్డును 'బ్రహ్మాస్త్రం' బ్రేక్ చేయనుందో లేదో చూడాలి. బాయ్‌కాట్ బాలీవుడ్ ట్రెండ్ నడుస్తున్నా కూడా, టికెట్లు ఈ రేంజ్‌లో అమ్ముడవుతున్నాయంటే.. 'బ్రహ్మాస్త్రం' సినిమా సక్సెస్ కొడుతుందనే నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
Read More: Brahmastra : 'బ్రహ్మాస్త్రం' ప్రీ రిలీజ్ ప్రోమో విడుదల.. అంచనాలు మరింత పెంచిన విజువల్స్