స‌ర్కారు వారి పాట‌ (Sarkaru Vaari Paata): మహేష్ సినిమాతో మెసేజ్ ఇస్తున్న పోలీసులు

Updated on May 03, 2022 12:31 PM IST
హైద‌రాబాద్ పోలీసులు కొత్త ఆలోచ‌న‌ల‌తో ముందుకు వెళుతున్నారు. ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న పెంచ‌డానికి సోష‌ల్ మీడియాలో వైవిధ్యమైన పోస్టులు పెడుతున్నారు.  ఇటీవలే స‌ర్కారు వారి పాట‌  (Sarkaru Vaari Paata) సినిమాలోని వీడియో క్లిప్‌ను తమ ప్రమోషన్‌కి వాడుకున్నారు.
హైద‌రాబాద్ పోలీసులు కొత్త ఆలోచ‌న‌ల‌తో ముందుకు వెళుతున్నారు. ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న పెంచ‌డానికి సోష‌ల్ మీడియాలో వైవిధ్యమైన పోస్టులు పెడుతున్నారు.  ఇటీవలే స‌ర్కారు వారి పాట‌ (Sarkaru Vaari Paata) సినిమాలోని వీడియో క్లిప్‌ను తమ ప్రమోషన్‌కి వాడుకున్నారు.

హైద‌రాబాద్ పోలీసులు కొత్త ఆలోచ‌న‌ల‌తో ముందుకు వెళుతున్నారు. ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న పెంచ‌డానికి సోష‌ల్ మీడియాలో డిఫ‌రెంట్ పోస్టులు పెడుతున్నారు.  స‌ర్కారు వారి పాట‌  (Sarkaru Vaari Paata సినిమా ట్రైల‌ర్‌లో మ‌హేష్ బాబు హెల్మెట్ సీన్ తెగ హైలెట్ అయిన సంగతి తెలిసిందే. హైద‌రాబాద్ పోలీసులు ఆ వీడియో క్లిప్‌ను త‌మ సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. ఎవరైనా సేఫ్టీ కోసం మొద‌ట హెల్మెట్ ధ‌రించాలంటూ స‌ర్కారు వారి పాట సినిమా సీన్ పోస్ట్ చేశారు. 

ప్ర‌జ‌ల‌కు వినూత్న రీతిలో అవగాహన కల్పించడంలో హైదరాబాద్ పోలీసులు ఎప్పుడూ ముందుంటారు. ఇదే క్రమంలో సోష‌ల్ మీడియా వేదికల ద్వారా హైద‌రాబాద్ పోలీసులు ప్ర‌జ‌ల‌కు భ‌ద్ర‌త‌కు సంబంధించిన అంశాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు తెలుపుతుంటారు. ప్ర‌స్తుతం స‌ర్కారు వారి పాట వీడియో క్లిప్ ట్వీట్స్ ద్వారా  వైర‌ల్ అవుతోంది. హైద‌రాబాద్ పోలీసుల ఐడియా సూప‌ర్ అంటూ నెటిజ‌న్లు సైతం కామెంట్లు పెడుతున్నారు. "త‌మ హీరో న‌టించిన సినిమా నుంచి మంచి మెసేజ్ పౌరులకు వెళ్తోంది" అంటూ మ‌హేష్ బాబు ఫ్యాన్స్ తెగ రీ ట్వీట్లు కొడుతున్నారు. 

Sarkaru Vaari Paata

ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, కీర్తి సురేష్ న‌టిస్తున్న స‌ర్కారు వారి పాట మే 12న విడుద‌ల కానుంది.  మాస్ యాక్షన్ థ్రిల్లర్ క‌థ‌తో ఈ సినిమాను ప‌రుశురామ్ తెర‌కెక్కించారు. కొన్ని గంటల ముందు రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైల‌ర్ మిలియ‌న్ల వ్యూస్‌తో టాప్ 1లో ట్రెండ్ అవుతోంది. మహేష్ బాబు  డైలాగ్స్, కామెడీ టైమింగ్, యాక్షన్ ఓ రేంజ్‌లో ఉన్నాయంటూ ట్రైల‌ర్ చూసిన అభిమానులు మురిసిపోతున్నారు. 

స‌ర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) సినిమాకు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ సంగీతం అందించారు. జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించారు. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!