అమెరికాలో మ‌హేష్ బాబు (Mahesh Babu) సినిమాకు గ‌ట్టి పోటీ !

Updated on May 04, 2022 02:50 PM IST
స‌ర్కారు వారి పాట సినిమా అమెరికాలో డాల‌ర్లు కొల్ల‌గొడుతుంద‌ని అంతా అనుకున్నారు. కానీ మ‌హేష్(Mahesh Babu)  సినిమాపై డాక్ట‌ర్ స్ట్రేంజ్ ఇంపాక్ట్ ఉంటుంద‌ని కంగారు ప‌డుతున్నార‌ట‌. స‌ర్కారు వారి పాట అమెరికాలో లాభాలు తేన‌ట్టేనా...
స‌ర్కారు వారి పాట సినిమా అమెరికాలో డాల‌ర్లు కొల్ల‌గొడుతుంద‌ని అంతా అనుకున్నారు. కానీ మ‌హేష్(Mahesh Babu)  సినిమాపై డాక్ట‌ర్ స్ట్రేంజ్ ఇంపాక్ట్ ఉంటుంద‌ని కంగారు ప‌డుతున్నార‌ట‌. స‌ర్కారు వారి పాట అమెరికాలో లాభాలు తేన‌ట్టేనా...

స‌ర్కారు వారి పాట సినిమా అమెరికాలో డాల‌ర్లు కొల్ల‌గొడుతుంద‌ని అంతా అనుకున్నారు. కానీ మ‌హేష్ బాబు (Mahesh Babu) సినిమాపై డాక్ట‌ర్ స్ట్రేంజ్ ప్రభావం పడే అవకాశం ఉందట. అదే నిజమైతే, స‌ర్కారు వారి పాట సినిమా అమెరికాలో లాభాలు తేన‌ట్టేనా...? అన్నది ఇప్పుడు ట్రేడ్ వర్గాల ముందున్న అతి  ప్రధాన ప్రశ్న. 

ప్రిన్స్ మ‌హేష్ బాబు ప్రస్తుతం వ‌రుస హిట్ సినిమాల‌తో దూసుకుపోతున్నారు. ఇటీవలే ఆయన నటించిన స‌ర్కారు వారి పాట సినిమా ట్రైల‌ర్  యూట్యూబ్‌లో విడుదలైంది. ఆ తర్వాత మిలియ‌న్ల వ్యూస్‌తో అద‌ర‌గొట్టింది. ఇక ఇదే సినిమా రిలీజ్ త‌ర్వాత, కాసుల వ‌ర్షం కురిపిస్తుందని అభిమానులు ఆశ‌ప‌డుతున్నారు. 

ఇదే  క్రమంలో స‌ర్కారు వారి పాట (Sarkar Vaari Paata) సినిమా పై హాలీవుడ్ మూవీ డాక్టర్ స్ట్రేంజ్ ప్రభావం ప‌డుతుందేమోన‌ని కంగారు ప‌డుతున్నారు. అమెరికాలో స‌ర్కారు వారి పాట సినిమాను భారీ బ‌డ్జెట్‌తో కొనుగోలు చేశారు బయ్యర్లు. లాభాల మాట ఎలా ఉన్నా,అస‌లు వ‌స్తే చాల‌ని డిస్టిబ్య్రూట‌ర్లు  అనుకుంటున్నారు. డాక్ట‌ర్ స్ట్రేంజ్ సినిమాకి ఉన్న హైప్.. స‌ర్కారు వారి పాట‌ను వెనక్కి నెడుతుంద‌ని భ‌య‌ప‌డుతున్నారు. 

Sarkaru Vaari Paata

మ‌హేష్ బాబు యాక్టింగ్ ... డైలాగ్స్‌... ఫాలోయింగ్‌ను దృష్టిలో పెట్టుకుని అమెరికన్ బయ్యర్లు ఎక్కువ చెల్లింపులు చేశారు. ఫ్లై హై సినిమా, శ్లోక ఎంట‌ర్‌ట్రైన్మెంట్ క‌లిసి ఈ  సినిమా రైట్స్ పొందారు.  అదేవిధంగా, స‌ర్కారు వారి పాట ఎక్కువ షోలు ఆడేలా ప్లాన్ చేస్తున్నారు.  

అయితే సర్కారు వారి పాట సినిమాపై డాక్టర్ స్ట్రేంజ్ ప్రభావం తప్పకుండా పడుతుందని అభిమానులు అనుకుంటున్నారు. 2019లో మహేష్ న‌టించిన మ‌హ‌ర్షి సినిమాకి కూడా ఇదే ప‌రిస్థితి ఎదురైంది. ఆ సమయంలోనే ఎవెంజర్స్: ది ఎండ్ గేమ్ సినిమా విడుద‌లైంది.  ఏదేమైనా, మ‌హేష్ బాబు (Mahesh Babu) కు పోటీగా హాలీవుడ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అన్నట్లు ఉంది అక్కడి పరిస్థితి. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!