ఫ్యామిలీ మ్యాన్‌2లో నటనకు ఉత్తమ నటి అవార్డు.. ఇన్‌స్టాలో షేర్‌‌ చేసిన సమంత (Samantha)

Updated on May 19, 2022 10:35 AM IST
ఉత్తమ నటి అవార్డుతో సమంత (Samantha)
ఉత్తమ నటి అవార్డుతో సమంత (Samantha)

విభిన్న పాత్రలు సెలెక్ట్‌ చేసుకుంటూ త‌న న‌ట‌న‌, అందంతో ఇండ‌స్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంది స‌మంత‌ (Samantha). ‘ఏ మాయ చేశావే’ సినిమాతో టాలీవుడ్‌లోకి వచ్చిన సమంత.. స్టార్‌‌ హీరోయిన్‌గా కొనసాగుతోంది. సౌత్ ఇండియాలోని టాప్ హీరోయిన్లలో ఒకరైన స‌మంత.. అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో కూడా ముందు వరుసలోనే ఉంది. ఏడాదికి రెండు, మూడు సినిమాల‌లో న‌టిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది ఈ అందాల భామ. అక్కినేని నాగ‌చైత‌న్యతో విడాకుల త‌ర్వాత స‌మంత..కెరీర్‌‌పై మరింతగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఇటీవల నటించిన వెబ్‌ సిరీస్‌లో నటనకుగాను ఉత్తమ న‌టి అవార్డును గెలుచుకుంది సమంత.

అమేజాన్ సంస్థ తెర‌కెక్కించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్-2’ ఘ‌న విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. ఈ వెబ్ సిరీస్‌లో స‌మంత రోల్‌కు అభిమానుల నుంచే కాకుండా విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందాయి సమంతకు, ఈ వెబ్‌సిరీస్‌తో స‌మంత‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. తాజాగా ఆమె న‌ట‌న‌కు గాను క్రిటిక్స్ ఛాయిస్ సంస్థ ఉత్తమ నటి అవార్డు అందించింది. ఈ అవార్డుకు ఎంపిక కావడం ప‌ట్ల స‌మంత సంతోషం వ్యక్తం చేసింది. తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో అవార్డుతో దిగిన ఫోటోను షేర్ చేసింది. సమంతకు పలువురు సినీ ప్రముఖులు అభినందనలు చెబుతున్నారు.

ఇక, తెలుగు సినిమాల్లో హీరో, హీరోయిన్ల పాపులారిటీ తెలిపేందుకు ఓ సంస్థ స‌ర్వే చేసింది. ఆ స‌ర్వేలో పాపుల‌ర్ హీరోగా ఎన్టీఆర్ ముందుంటే.. టాప్ హీరోయిన్ ప్లేస్‌ను స‌మంత(Samantha) సొంతం చేసుకున్నారు. 

నాలుగేళ్లుగా ఒక్క సినిమా కూడా చేయ‌ని ఎన్టీఆర్ కొమ‌రం భీముడిగా మ‌రో నాలుగు త‌రాలు గుర్తుపెట్టుకునేలా చేశాడు ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి. ఆర్.ఆర్.ఆర్ సినిమాలో ఎన్టీఆర్ న‌ట విశ్వ‌రూపం చూపారు. త‌న కేరియ‌ర్‌లో బెస్ట్ సినిమాగా ఎన్టీఆర్‌కు ఆర్.ఆర్.ఆర్. సూప‌ర్ డూప‌ర్ హిట్ ఇచ్చింది. ప్రముఖ సర్వే సంస్థ ఆర్మాక్స్ ఇండియ‌న్  యాక్ట‌ర్ల‌పై స‌ర్వే నిర్వ‌హిస్తుంది. లేటెస్ట్ సర్వేలో అత్యంత పాపులారిటీ ఉన్న టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ టాప్ ప్లేస్ సొంతం చేసుకున్నారు. ఏప్రిల్ 2022 సర్వే ప్రకారం ఎన్టీఆర్ మొద‌టి ర్యాంకు సాధించారు. గ‌తేడాది ఎన్టీఆర్ టాప్ 4లో నిలిచారు. ఎన్టీఆర్ తర్వాత ప్రభాస్ ప్రభాస్ 2వ స్థానం సొంతం చేసుకున్నారు. టాప్ ఫైవ్ లో వరుసగా ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్ ఉన్నారు. 

ఇక హీరోయిన్ల‌లో పాపుల‌రిటీలో టాప్ ప్లేస్ స‌మంత‌దే. సామ్(Samantha) మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. రెండో స్థానంలో కాజ‌ల్ అగ‌ర్వాల్, ఆ త‌ర్వాతి స్థానాల్లో అనుష్క, పూజా హెగ్డే, రష్మిక మందాన ఉన్నారు. త‌మ‌న్నా, కీర్తి సురేష్, సాయి ప‌ల్ల‌వి, ర‌కుల్ ప్రీత్ సింగ్, రాశీఖ‌న్నా టాప్ 6 నుంచి 10 స్థానాల్లో ఉన్నారు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!