Tees maar khan: ఆది హీరోగా తెరకెక్కుతున్న 'తీస్ మార్ ఖాన్'లో సునీల్ (Actor Sunil) కీలక పాత్ర.. పోస్టర్ రిలీజ్

Updated on Jul 30, 2022 06:35 PM IST
తాజాగా 'తీస్ మార్ ఖాన్' (Tees maar khan) మూవీ నుంచి అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో సునీల్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడట.
తాజాగా 'తీస్ మార్ ఖాన్' (Tees maar khan) మూవీ నుంచి అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో సునీల్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడట.

ఆది సాయి కుమార్ (Aadi sai kumar) హీరోగా పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా తీస్ మార్ ఖాన్ (Tees maar khan) అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రొడక్షన్ నెంబర్ 3 గా విజన్ సినిమాస్ బ్యానర్ పై ప్రముఖ వ్యాపారవేత్త డా.నాగం తిరుపతి రెడ్డి ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ‘నాటకం’ ఫేమ్ కళ్యాణ్ జి గోగణ (Kalyanji Gogana) దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. 

'తీస్ మార్ ఖాన్' (Tees maar khan) ఆగస్ట్ 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతోనే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు పెంచేసింది. అందులో భాగంగానే ఇది వరకు విడుదల చేసిన పోస్టర్లు, టీజర్లు, పాటలు ప్రేక్షకులను మెప్పించాయి. ఈ నేపథ్యంలో తాజాగా సునీల్ పాత్రకు సంబంధించిన క్యారెక్టర్ పోస్టర్‌ను మేకర్లు విడుదల చేశారు.

తాజాగా ఈ మూవీ నుంచి అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో సునీల్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడట. ఈ మేరకు ఆయన పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్లు. ఈ చిత్రంలో సునీల్‌ది ఇంపార్టెంట్ రోల్ అని తెలుస్తోంది. ఇక ఈ పోస్టర్‌లో సునీల్ సీరియస్ లుక్‌లో కనిపిస్తున్నాడు.

ఈ సినిమాలో సునీల్.. 'చక్రి' (Chakri) పాత్రలో  నటించబోతున్నట్లుగా తెలుపుతూ.. ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో సునీల్..  సీరియస్‌గా ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు కనిపిస్తున్నారు. అయితే, ఈ పిక్ చూస్తుంటే.. మరోసారి సునీల్ తన నట విశ్వరూపాన్ని చూపించబోతున్నట్లు అర్థమవుతోంది. కమెడియన్‌గా, హీరోగా, విలన్‌గా తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తోన్న సునీల్.. ఈ సినిమా ద్వారా మరోసారి వినూత్న పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 

'తీస్ మార్ ఖాన్' సినిమాలో స్టూడెంట్, రౌడీ, పోలీస్ గా మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలో ఆది సాయికుమార్ నటించడం ఈ సినిమాకు మేజర్ అసెట్ అని చెప్పవచ్చు. ఇక, ఈ చిత్రానికి సంగీతం సాయి కార్తీక్ అందించగా.. బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ చేశారు. మణికాంత్ ఎడిటర్ గా వ్యవహరించారు.

Read More: దుమ్ము రేపుతున్న హీరో ఆది 'తీస్‌మార్ ఖాన్' టీజర్.. పాయల్ రాజ్‌పుత్‌‌తో రొమాన్స్ అదుర్స్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!