ఎన్టీఆర్‌తో స్నేహం గురించి ఏం చెప్పాలో తెలియడం లేదు: రామ్ చరణ్ (Ram Charan)
రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్.. ఈ ఇద్దరూ తెలుగు చలన చిత్ర పరిశ్రమకు నేడు రెండు కళ్లు. ఒకరు మెగాస్టార్ కుమారుడైతే, మరొకరు నటసార్వభౌముడి మనుమడు. నటనలో ఇద్దరూ ఇద్దరే. వీరిద్దరూ కలిసి నటించిన RRR చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టరో మనకు తెలియంది కాదు. అంతే కాదు.. ఈ ఇద్దరు స్టార్ హీరోలూ మంచి స్నేహితులు కూడా. వారి స్నేహం గురించి గతంలో వివిధ పత్రికలు .. వివిధ సందర్భాలలో ప్రస్తావించాయి.
ఇదే క్రమంలో ఈ రోజు రామ్ చరణ్ (Ram Charan) తన ఫ్రెండ్ ఎన్టీఆర్‌కు, పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ అంటే తనకు ఎంత అభిమానమో తెలిపేలా, రామ్ చరణ్ ఓ చిత్రాన్ని పోస్ట్ చేశారు. తమ మధ్య ఉన్న బంధాన్ని ఎలా వర్ణించాలో తెలియడం లేదంటూ, రామ్ చరణ్ ఎన్టీఆర్‌కు విషెస్ తెలిపారు.
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం రామ్ చరణ్, ఎన్టీఆర్.. ఈ ఇద్దరు కథానాయకులూ బెస్ట్ ఫ్రెండ్స్‌గా తమకంటూ ఒక పంథాను ఏర్పాటు చేసుకున్నారు. వీరిరువురూ ఎన్నో ఏళ్ల నుండీ, ఇండస్ట్రీలో మంచి స్నేహితులుగా వెలుగొందుతున్నారనే విషయం చాలామందికి తెలియదు. ఆర్.ఆర్.ఆర్. సినిమాతో వీరి స్నేహబంధం మరింత బలపడింది. ఆర్.ఆర్.ఆర్. ప్రమోషన్‌లో ఎన్టీఆర్ తమ స్నేహానికి దిష్టి తగలకూడదన్నారు. ఆ మాటలతో వీరి ఫ్రెండ్ షిప్ చాలా స్ట్రాంగ్ అని చెప్పకనే చెప్పారు యంగ్ టైగర్.
ఎన్టీఆర్ తనను హత్తుకున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, చెర్రీ ఆయనకు వినూత్న రీతిలో బర్త్ డే విషెస్ తెలిపారు.
రామ్ చరణ్ తన సహనటుడు ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ వైరల్‌గా మారింది. పైగా వీరిద్దరి స్నేహ బంధాన్ని చూసి, వారిరువురి అభిమానులు చాలా సంతోషపడుతున్నారు. అలాగే, రామ్ చరణ్ పోస్టుకు.. ఎన్టీఆర్ అభిమానులు సైతం ఫుల్ ఖుషీగా ఉన్నారు. "థాంక్యూ చరణ్" అంటూ రిప్లై ఇస్తున్నారు. "జై ఎన్టీఆర్" అంటూ రామ్ చరణ్ ట్వీట్‌ను రీ ట్వీట్ చేస్తున్నారు.
ఆర్.ఆర్.ఆర్ (RRR) సినిమా నిర్మాతలు తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుంచి ఎన్టీఆర్‌కు విషెస్ తెలిపారు. ఆర్ఆర్ఆర్ సినిమా టీమ్ " మా భీంకు పుట్టినరోజు శుభాకాంక్షలు" అంటూ పోస్టు చేశారు . ఇక మరోపక్క, ఎన్టీఆర్ కొత్త సినిమాల సందడి షూరూ అయింది. కొరటాల శివతో ఎన్టీఆర్ 30, ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ 31 సినిమాలు చేయనున్నారు మన యంగ్ టైగర్.