రామ్‌ పోతినేని (Ram Pothineni) ‘ది వారియర్’ షూటింగ్‌ పూర్తి.. హై స్టాండర్డ్స్‌లో సినిమా తీశామంటున్న నిర్మాత

Updated on May 29, 2022 02:09 PM IST
రామ్‌ పోతినేని (Ram Pothineni) ‘ది వారియర్’
రామ్‌ పోతినేని (Ram Pothineni) ‘ది వారియర్’

ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ సత్య పాత్రలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) నటిస్తున్న సినిమా ‘ది వారియర్’. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి లింగుస్వామి దర్శకత్వం వహించాడు. జూలై 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది.

‘మా బ్యానర్‌‌లో ప్రెస్టీజియస్‌గా నిర్మిస్తున్న సినిమా ‘ది వారియర్’. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కంటెంట్ పరంగా, టెక్నిక‌ల్‌గా హై స్టాండ‌ర్డ్స్‌లో టీజర్‌‌ ఉందని చెబుతున్నారు. టీజర్‌లో డైలాగులకు మంచి స్పందన వచ్చింది. సినిమా కూడా అదే రేంజ్‌లో ఉంటుంది. సినిమా షూటింగ్ పూర్తయింది. వారం రోజులుగా హీరో రామ్‌పై సాంగ్ షూట్ చేశాం. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో 150 మంది డ్యాన్సర్లు, 100 మంది మోడల్స్‌తో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పాటను చిత్రీకరించాం. పోస్ట్ ప్రొడక్షన్, రీ రికార్డింగ్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే మిగతా పాటలు విడుదల చేస్తాం. ఇప్పటికే విడుదలైన ‘బుల్లెట్..’ సాంగ్ బాగా పాపులర్ అయ్యింది. ఆ పాటకు 55 మిలియన్ వ్యూస్ రావడం సంతోషంగా ఉంది. మిగతా పాటలు కూడా అందరినీ తప్పకుండా మెప్పిస్తాయి’ అని నిర్మాత శ్రీనివాసా చిట్టూరి అన్నారు. కాగా, రామ్ (Ram Pothineni) సరసన కృతి శెట్టి హీరోయిన్‌గా నటించింది. ది వారియర్ సినిమాలో ఆది పినిశెట్టి విలన్‌గా చేశాడు. మరో కీలక పాత్రలో అక్షరా గౌడ కనిపించనుంది.

రామ్‌ పోతినేని (Ram Pothineni) ‘ది వారియర్’  షూటింగ్ పూర్తైన తర్వాత ఫోటో షేర్ చేసిన చిత్ర యూనిట్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!