రామ్ పోతినేని (Ram Pothineni): “ది వారియర్” సినిమాలో దుమ్మురేపిన మన ఇస్మార్ట్ శంకర్

Updated on May 14, 2022 11:56 PM IST
హీరో రామ్ పోతినేని(Ram Pothineni) కొత్త సినిమా ది వారియ‌ర్ (The Warriorr) మూవీ టీజ‌ర్ రిలీజ్
హీరో రామ్ పోతినేని(Ram Pothineni) కొత్త సినిమా ది వారియ‌ర్ (The Warriorr) మూవీ టీజ‌ర్ రిలీజ్

టాలీవుడ్ స్టైలిష్ హీరో రామ్ పోతినేని (Ram Pothineni) నటించిన కొత్త సినిమా "ది వారియ‌ర్ (The Warrior)".  తాజాగా ఈ సినిమా టీజ‌ర్ రిలీజ్ అయింది. ఇందులో పోలీస్ ఆఫీస‌ర్‌గా రామ్  పోతినేని డైలాగులు చాలా పవర్ ఫుల్‌గా పేలాయి. ద‌ర్శ‌కుడు లింగుస్వామి త‌మిళ్, తెలుగు భాషలలో ఈ సినిమాను తెరకెక్కించారు. 

ఇప్పటివరకూ రొమాంటిక్, మాస్ క‌థ‌ల‌తో మనల్ని అల‌రించిన రామ్ పోతినేని,  "ది వారియ‌ర్" సినిమాలో సీరియ‌స్ రోల్ చేశారు. పోలీస్ ఆఫీస‌ర్‌గా ఆ పాత్రలో ఒదిగిపోయారు. "వీలైతే మారిపోండి.. లేదా పారిపోండంటూ" రౌడీల‌కు రామ్ ఇచ్చే వార్నింగ్ టీజ‌ర్‌లో బాగా ఆక‌ట్టుకుంది. "పాన్ ఇండియా రౌడీలంటూ" రామ్ పోతినేనితో చెప్పించిన డైలాగులు కూడా బాగా పేలాయి.

ప్రస్తుతం ఈ సినిమా టీజ‌ర్ ఇండియాలో టాప్‌లో ట్రెండ్ అవుతుంది. "ఉప్పెన" సినిమాతో క్రేజీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న కృతి శెట్టి  రామ్‌కు జోడిగా ఈ చిత్రంలో న‌టించింది. ఇందులో కృతి శెట్టి ఒక వైవిధ్యమైన కథానాయిక పాత్రలో  నటిస్తుండగా,. యంగ్ హీరో ఆది పినిశెట్టి విల‌న్‌గా న‌టిస్తున్నారు. 

తొలుత ఈ సినిమా కథను నిర్మాతలు, అల్లు అర్జున్‌కి వినిపించారట. కానీ, బన్నీకి ఉన్న బిజీ షెడ్యూల్ కార‌ణంగా సినిమా ప‌ట్టాలెక్క‌లేదు. ఆ త‌ర్వాత "ది వారియ‌ర్ (The Warrior)"  సినిమాలో రామ్ పోతినేని హీరోగా నటిస్తున్నారని అధికారిక ప్రకటన వెలువడింది.. శ్రీనివాస చిట్టూరి "ది వారియ‌ర్" సినిమాకు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. జూలై 14 వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!