నిర్మాత రామానాయుడు (D. Ramanaidu) జయంతికి నివాళులు అర్పించిన సురేష్, వెంకటేష్, రానా
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్ట్స్ సాధించిన ఏకైక తెలుగు నిర్మాత దగ్గుబాటి రామానాయుడు (D. Ramanaidu). 13 భాషల్లో 150 సినిమాలకు పైగా నిర్మించారు. రామానాయుడు జయంతి సందర్భంగా ఆయన కుమారులు సురేష్, వెంకటేష్ (Venkatesh), మనువడు రానా నివాళులు అర్పించారు. తన తండ్రి బయోపిక్‌లో నటించాల్సిన అవకాశం వస్తే తప్పకుండా నటిస్తానని వెంకటేష్ తెలిపారు.
వెంకటేష్ (Venkatesh) తన తండ్రి జయంతి సందర్భంగా ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. తండ్రి అంటే ఎంతో ప్రేమ అని.. తన తండ్రిని మిస్ అవుతున్నానంటూ వెంకటేష్ పోస్ట్ చేశారు. రామానాయుడు పరిచయం చేసిన నటులలో వెంకటేష్ ఒకరు. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు వెంకటేష్. నిర్మాతగా రామానాయుడు టాలీవుడ్‌లో టాప్ పోజిషన్‌లో ఉంటే.. హీరోగా విజయాలు అందుకుంటూ విక్టరీ వెంకటేష్ అని పేరు తెచ్చుకున్నారు వెంకీ. తండ్రికి తగ్గ తనయుడిగా వెంకీ పేరు సంపాదించుకున్నారు.
రానా దగ్గుబాటి తన తాత రామానాయుడు జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు. తన స్కిప్ట్ తన తాతే అంటూ పోస్ట్ పెట్టారు. ఏషియన్ సినిమాస్ కూడా రామానాయుడు(D. Ramanaidu) ఓ గొప్ప నిర్మాత అంటూ ట్వీట్ చేసింది.