మరో తమిళ డైరెక్టర్‌తో సినిమాకు మెగా పవర్‌స్టార్ రాంచరణ్ (Ram Charan) గ్రీన్‌సిగ్నల్
మెగా పవర్ స్టార్ రాంచరణ్ (Ram Charan) ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియన్ స్టార్‌గా మారిపోయాడు. ఈ సినిమా తర్వాత చరణ్ అన్నీ పాన్ ఇండియా సినిమాలనే లైన్‌లో పెట్టాడు. ఇప్పటికే ఒక సినిమా షూటింగ్ జరుగుతుండగా.. మరొకటి మొదలు కావాల్సి ఉంది. స్టార్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తన 15వ సినిమా చేస్తున్నాడు చరణ్. ఇందులో డ్యూయల్ రోల్లో కనిపించనున్నాడని సమాచారం.
కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో అంజలి, జయరాం, సునీల్, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్‌లో తెలుగు, హిందీతో పాటు సౌత్ భాషలలో కూడా రిలీజ్ చేయనున్నారు. ఇక గౌతం తిన్ననూరి దర్శకత్వంలో కూడా చరణ్ ఓ సినిమా ఒప్పుకున్నాడు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించనుంది.
దర్శకుడు శంకర్‌తో సినిమా చేస్తోన్న చరణ్ ఇప్పుడు మరో తమిళ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. కార్తితో ఖైదీ సినిమాతో భారీ హిట్ అందుకున్న లోకేష్ కనగరాజ్, ఆ తర్వాత విజయ్‌తో మాస్టర్ సినిమా తీసి భారీ హిట్ కొట్టాడు. కమల్ హాసన్ హీరోగా నటించిన విక్రమ్ సినిమాను లోకేష్ తెరకెక్కించాడు. విక్రమ్ సినిమాలో విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్, సూర్య కీలక పాత్రల్లో కనిపించనున్నారు. విడుదలకు రెడీగా ఉన్న సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ క్రమంలోనే రామ్ చరణ్‌తో కూడా లోకేష్ సినిమా చేయనున్నట్టు సమాచారం. మరి దీనికి సంబంధించిన అఫీషియల్ కన్‌ఫర్మేషన్ ఎప్పుడొస్తుందో చూడాలి.
పక్కా ప్లానింగ్‌తో చరణ్ సినిమాలు చేస్తున్నాడు. అందులో భాగంగానే క్రేజీ డైరెక్టర్స్‌ను లైన్‌లో పెడుతున్నాడు. సక్సెస్‌పుల్ సినిమా డైరెక్టర్‌గా ఇమేజ్ వచ్చింది లోకేష్ కనగరాజ్‌కి. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా అంటే నెక్ట్స్ రేంజ్ మూవీగా ఉంటుందని చరణ్ అభిమానులు ఖుషీ అవుతున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ వెంటనే స్టార్ట్ అవుతుందా? లేక కొంత సమయం పడుతుందా అనేది తెలియడం లేదు. ఇప్పటికే చరణ్‌తో(Ram Charan) సినిమా కోసం గౌతమ్, సుకుమార్ వెయిటింగ్‌లో ఉన్నారని ఇండస్ట్రీ టాక్.