లోకేష్ క‌న‌గ‌రాజ్ డైరెక్ష‌న్‌లో అల్లు అర్జున్ ( Allu Arjun) సినిమా.. హోంబ‌లే ఫిలిమ్స్ వారి కొత్త ప్రాజెక్టు?

Updated on Jun 17, 2022 02:31 PM IST
లోకేష్ క‌న‌గ‌రాజ్, అల్లు అర్జున్ ( Allu Arjun) కాంబోలో ఓ సినిమా తీయాల‌ని ప్లాన్ చేశార‌ట‌. 
లోకేష్ క‌న‌గ‌రాజ్, అల్లు అర్జున్ ( Allu Arjun) కాంబోలో ఓ సినిమా తీయాల‌ని ప్లాన్ చేశార‌ట‌. 

టాలీవుడ్‌లో సాఫ్ట్‌గా కనిపించే హీరో అల్లు అర్జున్ ( Allu Arjun) తన సినిమాల్లో ఊర మాస్ యాక్ష‌న్‌తో అద‌ర‌గొడ‌తారు. పుష్ఫ‌తో అల్లు అర్జున్ సౌత్‌తో పాటు నార్త్ లోనూ ఫాలోయింగ్ పెంచుకున్నారు. ఇక పుష్ప సినిమాలో అల్లు అర్జున్ డైలాగులు ఓ రేంజ్‌లో పేలాయి. పుష్ప సినిమా ఎన్నో కొత్త కథలకు మార్గం చూపిందనే అనుకోవచ్చు.  

అల్లు అర్జున్‌తో సినిమా చేయడానికి, ఎందరో ఇతర భాషల దర్శకులు కూడా ఇప్పుడు మొగ్గుచూపుతున్నారని టాక్. 'విక్ర‌మ్ ' సినిమాతో బ్లాక్ బాస్ట‌ర్ హిట్ సాధించిన ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌గ‌రాజ‌న్‌తో బ‌న్ని ఓ సినిమా చేయ‌నున్నారని ప్రస్తుతం వార్తలు వస్తున్నాయి.

అల్లు అర్జున్ ( Allu Arjun) న‌టించిన 'ఆర్య ' సినిమాకు సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇక వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో తెరకెక్కిన ఆర్య‌  2, పుష్ఫ బ్లాక్ బాస్ట‌ర్ హిట్ సాధించాయి. ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర్జున్ 'పుష్ప 2 ' సినిమాలో న‌టిస్తున్నారు. 'పుష్ఫ 2 - ది రూల్‌ ' మ‌రో పాన్ ఇండియా సినిమాగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. యాక్ష‌న్, ల‌వ్, రొమాన్స్.. ఇలా ఏ విషయంలోనైనా ప్రేక్ష‌కుల‌కు కావాల్సినంత ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందిస్తూ, అల్లు అర్జున్ ప్రతీ సినిమాతో స‌క్సెస్ ఫుల్ హీరోగా దూసుకెళుతున్నారు. 

ఇక క‌మ‌ల్ హాస‌న్‌ న‌టించిన 'విక్ర‌మ్ ' సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన డైరెక్ట‌ర్ లోకేష్ క‌న‌గ‌రాజ్‌కు కూడా మంచి గుర్తింపు వ‌చ్చింది. ప్ర‌పంచ వ్యాప్తంగా  'విక్ర‌మ్ ' సినిమా వంద‌ల కోట్ల రూపాయ‌ల‌ వ‌సూళ్లను రాబ‌డుతోంది. మూడేళ్ల త‌ర్వాత త‌మిళ సినిమా రంగంలో భారీ విజ‌యం సాధించిన సినిమాగా 'విక్ర‌మ్ ' రికార్డు క్రియేట్ చేసింది. దీంతో లోకేష్ క‌న‌గ‌రాజ్, అల్లు అర్జున్ (Allu Arjun) కాంబోలో ఓ సినిమా వస్తుందని సోషల్ మీడియాలో పలు వార్తలు హల్చల్ చేస్తున్నాయి.

త‌మిళ ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌గ‌రాజ్‌ డైరెక్ష‌న్‌లో అల్లు అర్జున్ న‌టించ‌బోయే సినిమాను 'గీతా ఆర్ట్స్ '  నిర్మించ‌నుంది. పాన్ ఇండియా సినిమాగా దీనిని తెరకెక్కించనున్నారు. ఈ సినిమాని హిందీలో ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ నిర్మిస్తుంద‌ట‌. ఇక క‌న్న‌డ‌లో 'కేజీఎఫ్ '  'కేజీఎఫ్ 2 ' సినిమాల‌ను నిర్మించిన బ‌డా నిర్మాణ సంస్థ హోంబ‌లే ఫిలిమ్స్ అల్లు అర్జున్‌తో కూడా సినిమాను నిర్మించ‌నుందని టాక్.  

Read More: పుష్ప‌ 2 (Pushpa 2) : బడా స్టార్లతో పోటీగా.. సంక్రాంతి బ‌రిలోకి అల్లు అర్జున్ !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!