Priyanka Chopra: ప్రియాంక చోప్రా రిగ్గింగ్ చేసి గెలిచింది.. ఆమె అందగత్తె కాదు: మాజీ సుందరి ఆరోపణ

Updated on Nov 04, 2022 06:10 PM IST
ప్రపంచ సుందరి కిరీటాన్ని ప్రియాంక చోప్రా (Priyanka Chopra) రిగ్గింగ్ చేసి గెలిచారని మాజీ సుందరి లెయ్‌కానీ మెకనీ ఆరోపించారు
ప్రపంచ సుందరి కిరీటాన్ని ప్రియాంక చోప్రా (Priyanka Chopra) రిగ్గింగ్ చేసి గెలిచారని మాజీ సుందరి లెయ్‌కానీ మెకనీ ఆరోపించారు

హలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ గ్లోబల్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు ప్రియాంక చోప్రా (Priyanka Chopra). ఈ బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌పై మాజీ మిస్ బార్బడోస్ లెయ్‌కానీ మెకనీ (Leilani McConney) తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రపంచ సుందరి కిరీటాన్ని ప్రియాంక రిగ్గింగ్ చేసి గెలిచారని మెకనీ అన్నారు. ఆనాటి మిస్ వరల్డ్ పోటీల గురించి వివరిస్తూ ఆమె ఓ వీడియో షేర్ చేశారు. 

ప్రియాంకకు అక్రమంగా కిరీటం!

‘మిస్ బార్బడోస్ నేను 2000 సంవత్సరంలో జరిగిన ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొన్నా. ఆ ఏడాది మిస్‌ ఇండియా (ప్రియాంక చోప్రా) ప్రపంచ సుందరి కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. 1999, 2000.. ఇలా వరుసగా రెండేళ్ల పాటు ప్రపంచ సుందరి కిరీటం భారతీయులకే దక్కడానికి స్పాన్సర్లే కారణం. ఎందుకంటే ఆ సంస్థ ఇండియాకు చెందినది. ముఖ్యంగా ప్రియాంకకు మాత్రం కిరీటం అక్రమంగా  వరించింది. ఆమె అందగత్తె కాదు. రిహార్సల్స్‌లోనూ ప్రియాంక పాల్గొనలేదు. మధ్యాహ్నం పూట భోజనం కూడా ఆమె రూమ్‌కే నేరుగా వెళ్లేది. కానీ మిగిలిన వాళ్లందరికీ అలా కాదు. ప్రియాంకకు ప్రత్యేకంగా దుస్తులు డిజైన్‌ చేశారు. బీచ్‌లోనూ ఆమెకు స్పెషల్‌గా ఫొటోలు తీసి పేపర్లలో వచ్చేలా చేశారు. మిగిలిన వాళ్లందరినీ గుంపుగా తీశారు. ఆ ఏడాది ప్రపంచ సుందరి పోటీల్లో ఫేవరెటిజం ప్రదర్శించారు’ అని లెయ్‌కానీ మెకనీ ఆరోపణలు చేశారు. 

 ప్రియాంక (Priyanka Chopra)కు ప్రపంచ సుందరి కిరీటం అక్రమంగా  వరించిందని లెయ్‌కానీ మెకనీ ఆరోపించారు

నన్ను మోసం చేశారు

అప్పట్లో అందాల పోటీల్లో అవకతవకలు జరిగాయని మెకనీ చెప్పారు. ఆ పోటీల సమయంలో ప్రియాంక చోప్రా తనను బాగా విసిగించారని ఆమె ఆరోపించారు. ప్రియాంకకు సంబంధించిన ప్రత్యేకమైన దుస్తులను తన గదిలోనే డిజైన్ చేశారని మెకనీ తెలిపారు. తనను కావాలనే మోసం చేశారని ఆమె వాపోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి, ఈ ఆరోపణలపై ప్రియాంక చోప్రా ఎలా స్పందిస్తారోననేది ఆసక్తిగా మారింది. 

మూడేళ్ల తర్వాత ఇండియాకు..

ఇకపోతే, ప్రియాంక చోప్రా మూడేళ్ల తర్వాత భారత్‌కు వచ్చారు. పెళ్లి తర్వాత భర్త నిక్ జొనాస్‌తో కలసి లాస్ ఏంజెల్స్‌లో ఆమె సెటిలయ్యారు. దాదాపు మూడేళ్ల తర్వాత సోమవారం రాత్రి ముంబై ఎయిర్‌పోర్టులో దిగిన ప్రియాంకకు.. ఆమె అభిమానులు ప్లకార్డులు, బొకేలతో ఘనస్వాగతం పలికారు. తల్లయిన తర్వాత ప్రియాంక భారత్ కు రావడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఆమె వెంట భర్త నిక్ జొనాస్, కూతురు కూడా ఉన్నారు. కాగా, సరోగసి పద్ధతిలో ప్రియాంక, నిక్ దంపతులు ఇటీవల పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. 

పిగ్గీ చాప్స్ మూవీ వాయిదా

అభిమానులు ముద్దుగా పిగ్గీ చాప్స్ అని పిలిచే ప్రియాంక చోప్రా కెరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం ఆమె ఓ హాలీవుడ్ మూవీలో నటిస్తున్నారు. సామ్ హేగన్ ప్రధాన పాత్రలో యాక్ట్ చేస్తున్న ఈ చిత్రం పేరు ‘ఇట్స్ ఆల్ కమింగ్ బ్యాక్ టు మీ’. జిమ్ స్ట్రౌస్ డైరెక్షన్ చేసిన ఈ సినిమా రిలీజ్ డేట్ మారింది. 2023 ఫిబ్రవరి 10 ఆడియెన్స్ ముందుకు వస్తామని ఈ మూవీ మేకర్స్ ప్రకటించారు. అయితే ఇప్పుడు మే 12న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ‘ఎస్ఎమ్ఎస్ ఫర్ డిచ్’ అనే జర్మన్ ఫిల్మ్ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. ఈ చిత్రంలో వితంతువు పాత్రలో ప్రియాంక కనిపించనున్నారు. 

Read more: EXCLUSIVE : కష్టాన్ని కూడా ఇష్టపడాలి.. అదే నా విజయ రహస్యం : సంగీత దర్శకుడు రఘు కుంచె (Raghu Kunche)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!