క్రేజీ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా ‘కీడా కోలా’ (Keeda cola)..!

Updated on Aug 24, 2022 01:24 PM IST
సరికొత్త క్రైమ్ కామెడీ మూవీ ‘కీడా కోలా’ని (Keeda cola) ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు తరుణ్ భాస్కర్ (Tharun Bhascker).
సరికొత్త క్రైమ్ కామెడీ మూవీ ‘కీడా కోలా’ని (Keeda cola) ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు తరుణ్ భాస్కర్ (Tharun Bhascker).

షార్ట్ ఫిలింస్‌తో కెరీర్‌ మొద‌లు పెట్టి.. ‘పెళ్ళి చూపులు’ (Pelli Chupulu) సినిమాతో ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు దర్శకుడు త‌రుణ్ భాస్క‌ర్‌ (Tharun Bhascker). ఆ తర్వాత దర్శకుడిగా 'ఈ నగరానికి ఏమైంది' సినిమాకు దర్శకత్వం వహించి తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. అనంతరం పలు సినిమాలను ప్రొడ్యూస్ చేస్తూ, నటుడిగా కూడా మారాడు. ఈ నేపథ్యంలో తరుణ్ భాస్కర్ నుండి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా అని ఆయన అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.

ఇలాంటి తరుణంలో సరికొత్త క్రైమ్ కామెడీ మూవీ ‘కీడా కోలా’ని (Keeda cola) ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు తరుణ్ భాస్కర్. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను జ‌రుపుకుంటున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే సెట్స్‌పైకి వెళ్ళ‌నుంది. వీజి సైన్మా, క్విక్ ఫాక్స్ సంస్థ‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. 

పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది విడుద‌ల కానుంది. ఇప్ప‌టికే చిత్రం నుండి విడుద‌లైన టైటిల్‌ పోస్ట‌ర్‌కు (Keeda Cola Title Poster) ప్రేక్ష‌కుల నుండి విశేష స్పంద‌న వ‌చ్చింది. ఇక ఈ సినిమాలో నటీనటులు, టెక్నీషియన్లు ఎవరనే విషయాలను మాత్రం తరుణ్ భాస్కర్ ఇప్పటికైతే వెల్లడించలేదు. కాగా మంగ‌ళ‌వారం రోజున 'కీడా కోలా' పూజా కార్య‌క్ర‌మాలు గ్రాండ్‌గా ప్రారంభ‌మయ్యాయి. 

ఇక, ఈ వేడుక‌కు టాలీవుడ్ నుండి ప‌లువురు సెల‌బ్రెటీలు గెస్ట్‌లుగా వ‌చ్చారు. సురేష్‌బాబు, హీరో సిద్ధార్థ్ (Hero Siddarth), సుహాస్‌ (Suhas), రాజా గౌత‌మ్‌తో పాటు ప‌లువురు సెల‌బ్రెటీలు ఈ వేడుక‌కు హాజరయ్యారు. త్వరలోనే చిత్ర యూనిట్ షూటింగ్ ప్రారంభించనుంది.

Read More: Tharun Bhascker : తరుణ్ భాస్కర్‌కు సూపర్ ఛాన్స్.. లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావుతో కలిసి కథ రాశారట !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!