Sita Ramam: 'సీతారామం' నుంచి ప్రేమ పాట‌ రిలీజ్ .. 'ఓ సీత' పాట‌కు అద్భుతమైన లిరిక్స్ రాసిన‌ అనంత శ్రీరామ్ 

Updated on Sep 01, 2022 03:15 PM IST
Sita Ramam:  'సీతారామం' బ్లాక్ బాస్ట‌ర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా నుంచి మేక‌ర్స్ 'ఓ సీతా..' అంటూ సాగే వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు.
Sita Ramam: 'సీతారామం' బ్లాక్ బాస్ట‌ర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా నుంచి మేక‌ర్స్ 'ఓ సీతా..' అంటూ సాగే వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు.

Sita Ramam : సౌత్ స్టార్ హీరో దుల్క‌ర్ స‌ల్మాన్ న‌టించిన 'సీతారామం' సినిమా నుంచి ప్రేమ పాట వీడియోను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. 'ఓ సీతా వ‌ద‌లనిక తోడ‌వుతా..' అంటూ సాగే పాట వీడియోను మేక‌ర్స్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. 'సీతారామం' సినిమాకు పాట‌లు ప్ల‌స్ పాయింట్‌గా నిలిచాయి. ఈ సినిమా మ్యూజిక్ మ‌న‌సుకు హాయినిచ్చేలా ఉందంటూ ప్రేక్ష‌కులు మెచ్చుకుంటున్నారు. 'సీతారామం' సినిమా చూసిన ప‌లువురు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు చూడ చ‌క్క‌ని ప్రేమ కావ్యం అంటూ ప్ర‌శంసిస్తున్నారు. 

పాట‌లు అద్భుతం

చ‌క్క‌టి ప్రేమ కావ్యంగా ఇటీవ‌ల‌ విడుద‌లైన ‘సీతారామం’ (Sita Ramam) చిత్రాన్ని సినీ సెల‌బ్రిటీలు సైతం ప్ర‌శంసిస్తూ సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్టులు పెడుతున్నారు. 'సీతారామం' బ్లాక్ బాస్ట‌ర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా నుంచి మేక‌ర్స్ 'ఓ సీతా..' అంటూ సాగే వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు.

ఎస్పీ చ‌ర‌ణ్, ర‌మ్య బెహ‌రా ఆల‌పించిన ఈ పాట ఎంతో బాగుందంటూ మ్యూజిక్ ల‌వ‌ర్స్ అంటున్నారు.  ఆల‌పించారు. 'ఓ సీతా..' అంటూ పాట‌ను రాసిన‌ అనంత శ్రీరామ్ ఈ సినిమాతో మ‌రింత పాపుల‌ర్ అవుతారంటూ నెటీజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు. 'సీతారామం' సినిమాకు విశాల్ చంద్ర‌శేఖ‌ర్ సంగీతం స‌మ‌కూర్చారు.

రూ. 100 కోట్ల సినిమా!

హను రాఘవపూడి ద‌ర్శ‌క‌త్వంలో 'సీతారామం' (Sita Ramam)  సినిమా ఆగ‌స్టు 5 తేదీన విడుద‌లైంది. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్‌కు జంట‌గా మృణాల్ ఠాకూర్ న‌టించారు. హీరోయిన్ ర‌ష్మిక మంద‌న్న, సుమంత్, తరుణ్ భాస్కర్ కీలక పాత్ర‌ల్లో క‌నిపించారు. వైజయంతీ మూవీస్ సమర్పణలో అశ్వనీదత్ నిర్మాతగా స్వప్న సినిమా పతాకంపై ఈ సినిమాను నిర్మించారు.

'సీతారామం' సినిమా విడుద‌లైన తొలి రోజు నుంచి పాజిటీవ్ టాక్‌తో థియేట‌ర్ల‌ను షేక్ చేస్తోంది. చూడ చ‌క్క‌ని ప్రేమ‌కావ్యం అంటూ ప్రేక్ష‌కులు మెచ్చుకుంటున్నారు. ఇక క‌లెక్ష‌న్ల ప‌రంగా కోట్ల రూపాయ‌ల‌ను కొల్ల‌గొడుతుంది. ఈ సినిమా క‌చ్చితంగా వంద కోట్ల రూపాయ‌ల‌ను వ‌సూళ్లు చేస్తుంద‌ని సినీ కిట్రిక్స్ అభిప్రాయ‌ప‌డుతున్నారు. 

Read More: Sita Ramam: 'సీతారామం' చూడ చ‌క్క‌ని ప్రేమ కావ్యం.. జాతీయ స్థాయిలో అవార్డులు అందుకోవాలి - చిరంజీవి (Chiranjeevi)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!