పవన్‌ కల్యాణ్‌ అంటే చాలా ఇష్టం.. భీమ్లానాయక్ సినిమా థియేటర్‌‌లో చూశా : అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran)

Updated on Jun 12, 2022 08:22 PM IST
అనుపమ పరమేశ్వరన్‌ (Anupama Parameswaran), పవన్‌ కల్యాణ్
అనుపమ పరమేశ్వరన్‌ (Anupama Parameswaran), పవన్‌ కల్యాణ్

‘ప్రేమమ్‌’తో టాలీవుడ్‌కు పరిచయమైంది మలయాళీ భామ అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran). యూత్‌ ఫుల్‌ ప్రేమ కథా సినిమాలతో ప్రేక్షకుల్ని అలరిస్తున్న అనుపమ నటించిన కొత్త సినిమా ‘బటర్‌ఫ్లై’. గంటా సతీష్‌బాబు తెరకెక్కించిన ‘బటర్‌‌ ఫ్లై’ సినిమా.. సస్పెన్స్‌ థ్రిల్లర్‌‌గా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ క్రమంలో అనుపమ తాజాగా ఓ యూట్యూబ్ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ‘బటర్‌ఫ్లై’ సినిమా కథ తనకు ఎంతగానో నచ్చిందని తెలిపింది. యూత్‌తోపాటు కుటుంబ ప్రేక్షకులను కూడా మెప్పించే డిఫరెంట్‌ కథతో ఈ సినిమా తెరకెక్కిందని చెప్పింది.

మలయాళంలో తాను నటించిన తొలి సినిమా విడుదలయ్యాక ఎంతో మంది నుంచి విమర్శలు ఎదుర్కొన్నానని, ఆ సమయంలో నెగెటివ్‌ కామెంట్స్‌ చూసి చాలా బాధపడ్డానని చెప్పింది అనుపమ. అభిమానుల వలనే తాను ఈ స్థాయికి చేరుకోగలిగానని తెలిపింది.

పవన్‌ కల్యాణ్‌ అంటే చాలా ఇష్టం

పవర్‌‌స్టార్‌‌ పవన్‌ కల్యాణ్‌ గురించి మాట్లాడే స్థాయికి తానింకా చేరుకోలేదని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పింది అనుపమ. పవన్‌ ఒక స్టార్ హీరో. ఆయనంటే నాకు చాలా ఇష్టం.

పవన్ కల్యాణ్‌ సినిమాలు చూస్తాను. ఆయన నటించిన కొత్త సినిమా ‘భీమ్లానాయక్‌’ చూశాను. బటర్‌‌ఫ్లై హీరో నిహాల్‌తో కలిసి భీమ్లానాయక్‌ ఫస్ట్‌ రోజు చూశాను. ఎవరూ గుర్తుపట్టకూడదని హైదరాబాద్‌ సుదర్శన్‌ థియేటర్‌‌లో పవన్‌ కల్యాణ్‌ సినిమాకు బురఖా వేసుకుని మరీ వెళ్లి వచ్చానని చెప్పింది అనుపమ.

అనుపమ పరమేశ్వరన్‌ (Anupama Parameswaran) బటర్‌‌ఫ్లై సినిమా పోస్టర్

కాగా, అనుపమా పరమేశ్వరన్‌ కొన్ని సినిమాలే చేసినా.. తక్కువ సమయంలోనే మంచి హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. తన అందం, అభినయంతో ఎంతో మంది హృదయాలను గెలుచుకుంది. ఎక్కువ సమయం సోషల్‌ మీడియాలో గడిపే అనుపమ తరచూ తన ఫొటోలు, వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ సందడి చేస్తుంది. ఇటీవల ‘రౌడీబాయ్స్‘ మూవీతో సందడి చేసిన అనుపమ ప్రస్తుతం కార్తికేయ 2, 18 పేజెస్‌, బటర్​ఫ్లై సినిమాలు చేస్తోంది.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన రిలేషన్‌షిప్ స్టేటస్‌ గురించి అనుపమ పలు విషయాలను షేర్ చేసుకుంది. 'నాకు లవ్‌ మ్యారేజ్‌పై మంచి అభిప్రాయమే ఉంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలను చూస్తుంటే ముచ్చటగా ఉంటుంది. ప్రేమ వివాహమే చేసుకోవాలని ఉంది. మా పేరెంట్స్‌కి కూడా ఈ విషయం తెలుసు. పెళ్లంటూ చేసుకుంటే లవ్‌ మ్యారేజ్‌ మాత్రమే చేసుకుంటా.

నేను సింగిల్‌.. కాదు మింగిల్‌.. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే నా రిలేషన్‌షిప్ స్టేటస్ నాకు కూడా సరిగ్గా తెలియట్లేదు. నేనైతే ప్రేమలో ఉన్నా.. మరి అవతలి సైడ్‌ నుంచి ఏమనుకుంటున్నారో తెలియదు. ప్రస్తుతం వన్‌ సైడ్‌ లవ్‌ అని మాత్రమే చెప్పగలను' అంటూ సంచలన విషయాలు చెప్పింది అనుపమా పరమేశ్వరన్‌. 

‘రౌడీ బాయ్స్‘ సినిమాకు అనుప‌మా పరమేశ్వరన్‌కు (Anupama Parameswaran) రూ.50 ల‌క్షల పారితోషికం ఇచ్చారట. ఇప్పటివ‌ర‌కు రూ.25 ల‌క్షల లోపు రెమ్యున‌రేష‌న్ మాత్రమే అందుకునే అనుప‌మకు.. ఇది కెరీర్‌లో హ‌య్యెస్ట్ రెమ్యున‌రేష‌న్ అని తెలుస్తోంది. ఆశిష్ రెడ్డి హీరోగా ప‌రిచ‌య‌మైన ‘రౌడీ బాయ్స్‘ చిత్రానికి హ‌ర్ష కొనుగొంటి ద‌ర్శక‌త్వం వ‌హించాడు.

Read More: సినిమా నాకు ఎదిరించే ధైర్యాన్ని ఇచ్చింది : 'అంటే సుందరానికి' ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ కళ్యాణ్ !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!