The Warrior: ది వారియర్ - వందల మంది డ్యాన్సర్లు, మోడల్స్‌తో స్టెప్పులేయనున్న రామ్ (RamPothineni)
టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని (Ram Pothineni) ది వారియర్ సినిమాతో ప్రేక్షకుల మందుకు రానున్నారు. లింగుస్వామి దర్శకత్వంలో ది వారియర్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి (krithi shetty) రామ్‌కు జోడిగా యాక్ట్ చేస్తున్నారు. యంగ్ హీరో ఆది పినిశెట్టి విలన్‌గా నటిస్తున్నారు. అక్షరా గౌడ కీలక పాత్రలో కనిపించనున్నారు. తెలుగు, తమిళ్ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. రీసెంట్‌గా రిలీజ్ అయిన ది వారియర్ (The Warrior) టీజర్ సోషల్ మీడియాలో దూసుకెళుతుంది.
ది వారియర్ సినిమాలో ఓ మాస్ సాంగ్‌ను స్పెషల్‌గా చిత్రీకరిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ రామ్ కొత్త సినిమాకు సంగీతం అందిస్తున్నారు. శేఖర్ మాస్టర్ ఆ స్పెషల్ సాంగ్‌కు కొరియోగ్రాఫర్‌గా కొత్త స్టెప్పులు కంపోజ్ చేశారు. దాదాపు 150 మంది డాన్సర్లు, 100 మంది మోడల్స్‌తో రామ్ మాస్ సాంగ్ చేస్తున్నారట. హైదరాబాద్‌లో మాస్ సాంగ్ షూటింగ్ పూర్తయింది. ఐపీఎస్ ఆఫీసర్ సత్య పాత్రలో రామ్ పోతినేని నటించారని నిర్మాత శ్రీనివాస చిట్లూరి అన్నారు. ది వారియర్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని చెప్పారు. తెలుగు, తమిళ భాషల్లో జూలై 14న విడుదల కానుందని శ్రీనివాస్ చిట్టూరి తెలిపారు.
రామ్ (Ram Pothineni) నటిస్తున్న ది వారియర్ సినిమా నుంచి ధడ ధడ లిరికల్ మాస్ సాంగ్ జూలై 4న రిలీజ్ కానుంది. ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ మాస్ సాంగ్‌ను విడుదల చేయనున్నారు. ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకం పై నిర్మిస్తున్నారు. ది వారియర్ హిందీ డబ్బింగ్ రైట్స్‌తో పాటు శాటిలైట్ రైట్స్ కూడా అమ్ముడుపోయాయట. తెలుగు, తమిళ్ భాషల్లో డిస్నీ హాట్ స్టార్ రూ. 35 కోట్లకు కొనుగోలు చేసిందట. విడుదలకు ముందే ది వారియర్ (The Warrior) సినిమా రూ. 41 కోట్ల బిజినెస్ చేసిందట.
రామ్ పోతినేని (Ram Pothineni) దూకుడు మీద ఉన్నారు. వరుస సినిమాలతో ప్రేక్షకులకు వినోదం పంచాలనుకుంటున్నారు. ది వారియర్ సినిమా విడుదల కాకుండానే మరో రెండు సినిమాలకు ఓకే చెప్పారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా సినిమా చేయనున్నారు రామ్ పోతినేని. బోయపాటి, రామ్ కాంబో సినిమా కూడా శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో రామ్, బోయపాటి సినిమా విడుదల కానుంది.