దసరా సందర్భంగా బాలకృష్ణ (BalaKrishna) ‘అన్‌స్టాపబుల్‌2’ ట్రైలర్ రిలీజ్ చేయనున్న ‘ఆహా’ (Aha)

Updated on Oct 07, 2022 12:02 AM IST
అన్‌స్టాపబుల్‌ సీజన్‌2లో బాలకృష్ణ (Bala Krishna) ఏ ఏ స్టార్లతో  సందడి చేస్తారో చూడాలని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
అన్‌స్టాపబుల్‌ సీజన్‌2లో బాలకృష్ణ (Bala Krishna) ఏ ఏ స్టార్లతో సందడి చేస్తారో చూడాలని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

నందమూరి బాలకృష్ణ (BalaKrishna) హోస్ట్‌గా చేస్తున్న టాక్‌షో.. అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే. ఈ షో ఫస్ట్‌ సీజన్‌ సక్సెస్‌ఫుల్‌గా పూర్తయ్యింది. అప్పటి నుంచి సెకండ్ సీజన్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ప్రేక్షకులు ముఖ్యంగా బాలయ్య అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా హీరోగా అలరిస్తున్న బాలయ్య టాక్‌షోఓకు హోస్ట్‌గా వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు.

ప్రముఖ ఓటీటీ ఆహా (Aha)లో స్ట్రీమింగ్‌ అయిన అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే మొదటి సీజన్‌ మంచి టీఆర్పీతో దూసుకెళ్లింది. స్టార్ హీరో అయ్యి ఉండి కూడా సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసే క్రమంలో బాలయ్య చేసిన సందడి అందరికీ ఎంతో వినోదాన్ని పంచింది.

సినిమాల్లో తన మార్క్‌ డైలాగులు, ఫైట్స్, యాక్షన్ సీన్స్‌తో సందడి చేసే బాలయ్య.. టాక్‌ షోలో తన మాటలు, సెన్సాఫ్ హ్యూమర్‌‌తో షోను సక్సెస్ చేశారు. బాలకృష్ణ టాక్ షో ఎలా చేస్తారు? అనే ప్రశ్నలను పటాపంచలు చేస్తూ.. టాక్ షోలన్నింటిలోనూ అన్‌స్టాపబుల్‌ను నంబర్‌‌వన్‌గా నిలబెట్టారు బాలకృష్ణ.

సూపర్‌‌స్టార్ మహేష్ బాబు, నేచురల్ స్టార్ నాని, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాస్ మహారాజ రవితేజ పలువురు స్టార్స్‌ను తన షోకు తీసుకువచ్చారు. ప్రస్తుతం అన్‌స్టాపబుల్‌ సీజన్‌2తో రావడానికి సిద్దమవుతున్నారు. 

అన్‌స్టాపబుల్‌ సీజన్‌2లో బాలకృష్ణ (Bala Krishna) ఏ ఏ స్టార్లతో  సందడి చేస్తారో చూడాలని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్..

అన్‌స్టాపబుల్‌ సీజన్2 గురించి అదిరిపోయే ఆప్డేట్స్ ఇస్తూ ప్రేక్షకుల ఆసక్తిని పెంచుతోంది ఆహా. బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే అన్‌స్టాపబుల్ సీజన్2ను సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారు బాలయ్య. అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే2 టైటిల్ సాంగ్‌ను ఇటీవల రిలీజ్ చేసింది ఆహా టీమ్.ఈ సాంగ్ ప్రేక్షకులకు బాగానే చేరువైంది.  

ఇక ఇప్పుడు అన్‌స్టాపబుల్ ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 4న ట్రైలర్‌‌ను విడుదల చేయనున్నట్టు పోస్టర్‌‌ను రిలీజ్ చేసింది ఆహా (Aha). ఈ పోస్టర్‌‌లో కౌబాయ్ గెటప్‌లో కనిపిస్తున్నారు బాలకృష్ణ. సీజన్‌2కు చాలా మంది స్టార్ హీరోలు గెస్ట్‌లుగా రానున్నారని తెలుస్తోంది. బాలకృష్ణ (BalaKrishna) హోస్ట్‌గా వ్యవహరించనున్న అన్‌స్టాపబుల్ సీజన్2 ఏ స్టార్ గెస్ట్‌తో మొదలవుతుందో అని ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read More : టర్కీలో హోటల్‌లో బాలకృష్ణ (BalaKrishna).. సామాన్యుడితో సరదాగా ముచ్చటించిన బాలయ్య

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!