"అన్ స్టాపబుల్ సీజన్2" (Unstoppable Season2) లో యంగ్ హీరోల కష్టాలు విని కంటతడి పెట్టిన బాలకృష్ణ (Balakrishna)!

Updated on Oct 21, 2022 12:55 PM IST
"అన్ స్టాపబుల్ సీజన్2" (Unstoppable Season 2) మొదటి ఎపిసోడ్ హైలైట్ కావడంతో రెండవ ఎపిసోడ్ కు టాలీవుడ్ యంగ్ హీరోలను ఆహ్వానించారు నిర్వాహకులు.
"అన్ స్టాపబుల్ సీజన్2" (Unstoppable Season 2) మొదటి ఎపిసోడ్ హైలైట్ కావడంతో రెండవ ఎపిసోడ్ కు టాలీవుడ్ యంగ్ హీరోలను ఆహ్వానించారు నిర్వాహకులు.

నందమూరి బాలకృష్ణ (Balakrishna) హోస్ట్ గా వ్యవహరిస్తున్న సెలబ్రిటీ టాక్ షో "అన్ స్టాపబుల్ సీజన్ 2" (Unstoppable Season 2). ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ అయిన 'ఆహా'లో (Aha OTT) ఈ మధ్యనే విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. రెండవ సీజన్ లో భాగంగా ఇప్పటికే మొదటి ఎపిసోడ్ లో భాగంగా నారా చంద్రబాబు నాయుడు హాజరు కావడంతో ఈ కార్యక్రమం పై ఇటు ప్రేక్షకులు మాత్రమే కాకుండా రాజకీయ నాయకులు కూడా ఎంతో ఆసక్తి కనబరిచారు.

"అన్ స్టాపబుల్ సీజన్ 2" (Unstoppable Season 2) మొదటి ఎపిసోడ్ హైలైట్ కావడంతో రెండవ ఎపిసోడ్ కు టాలీవుడ్ యంగ్ హీరోలను ఆహ్వానించారు షో నిర్వాహకులు. రెండో ఎపిసోడ్ లో యంగ్ హీరోలు విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ హాజరయ్యారు. ఈ ఫుల్ ఎపిసోడ్ త్వరలోనే టెలికాస్ట్ కానుంది. ఇందుకు సంబంధించిన ప్రోమోలను రిలీజ్ చేశారు. తాజాగా సెకండ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ ప్రోమో ఆద్యంతం ఎమోషనల్ గా సాగింది.

ప్రోమోలో భాగంగా బిగ్ ఇన్సల్ట్ మీ లైఫ్ లో ఏమిటి? అని హీరో సిద్దుని (Siddhu Jonnalagadda) బాలయ్య బాబు అడగగా.. మొహం మీద మచ్చలేసుకుని నువ్వు హీరో అవుతావా? అంటూ నవ్వారు అని చెప్పాడు. దాంతో బాలయ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి.. నువ్వు చెప్తుంటే నా కళ్ళలో నీళ్లు వస్తున్నాయి అంటూ సిద్దు ఏదో చెబుతుండగానే అతడిని ఆపి హగ్ చేసుకున్నారు బాలయ్య. 

ఆ తర్వాత విశ్వక్ సేన్ (Vishwak Sen) లైఫ్ లో వచ్చిన బిగ్ ట్రబుల్ ఏంటి అని అడగ్గా.. తన సినిమా సమయంలో అక్క హాస్పిటల్ లో జాయిన్ అయ్యారని.. రాత్రి 1 గంటవరకు హాస్పిటల్లో ఉండి ఉదయాన్నే 6 గంటలకి షూటింగ్ సెట్ కు వెళ్లేవాడినని చెప్తూ ఎమోషనల్ అయ్యాడు. డైరెక్టర్ కట్ చెప్పిన వెంటనే ఏడుపు వచ్చేసేదని, అటు అక్కని వదిలి ఉండలేక.. ఇటు సినిమా వదలలేక సతమతమయ్యానని చెప్పగా బాలయ్య కూడా ఆ మాటలకు ఎమోషనల్ అయ్యారు. ఇలా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ ప్రోమో (Promo) ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Read More: 'అన్‌స్టాపబుల్ సీజన్ 2' (Unstoppable Season 2) రెండో ఎపిసోడ్ ప్రోమో (Promo) అదిరిపోయిందిగా.. గెస్టులు వీరే!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!