కవలలకు జన్మనిచ్చిన సినీ నటి నమిత (Namitha)!.. సోష‌ల్ మీడియాలో వీడియో షేర్ చేసిన హీరోయిన్

Updated on Aug 20, 2022 10:33 AM IST
కృష్ణాష్ట‌మి రోజున త‌న పిల్ల‌ల‌తో క‌లిసి ఉన్న వీడియోను న‌మిత (Namitha) సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు.
కృష్ణాష్ట‌మి రోజున త‌న పిల్ల‌ల‌తో క‌లిసి ఉన్న వీడియోను న‌మిత (Namitha) సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు.

సౌత్ స్టార్ హీరోయిన్‌ నమిత (Namitha) పండంటి క‌వ‌ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చారు. త‌న‌కు ఇద్ద‌రు పిల్ల‌లు పుట్టార‌ని న‌మిత తెలిపారు. కృష్ణాష్ట‌మి రోజున త‌న పిల్ల‌ల‌తో క‌లిసి ఉన్న వీడియోను న‌మిత సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. ప్ర‌స్తుతం న‌మిత పోస్ట్ చేసిన వీడియో వైర‌ల్‌గా మారింది. న‌మితకు అభిమానులు, నెటిజ‌న్లు విష‌స్ తెలుపుతున్నారు. న‌మిత మ‌రో కొద్ది రోజుల్లో సినిమాల్లోకి వ‌చ్చే అవ‌కాశం కూడా ఉందంటున్నారు ఆమె అభిమానులు.

హీరోయిన్ న‌మిత(Namitha)సొంతం, జెమిని, సింహా వంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు ద‌గ్గ‌ర‌య్యారు. ప‌లు త‌మిళ‌, తెలుగు సినిమాల్లో న‌టించిన న‌మిత 2017లో వివాహం చేసుకున్నారు. వ్యాపారవేత్త వీరేంద్ర చౌదరిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తిరుపతిలోని ఇస్కాన్ లోటస్ టెంపుల్‌లో కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. 

న‌మిత (Namitha) ఇద్ద‌రు మ‌గ పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చారు.. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున త‌న‌కు క‌వ‌ల‌లు పుట్టార‌నే విషయాన్ని అభిమానులతో చెప్ప‌డం ఆనందంగా ఉందన్నారు. అభిమానుల ఆశీస్సులు ఎల్లప్పుడు తమతో ఉంటాయన్నారు. ఇన్‌స్టాలో ఓ వీడియో ద్వారా ఈ విష‌యాల‌ను అభిమానుల‌తో న‌మిత పంచుకున్నారు. అభిమానులు న‌మిత‌కు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. న‌మిత మ‌ళ్లీ సినిమాల్లోకి రావాల‌ని కోరుకుంటున్నారు. 

Read More: Namitha: బేబీ బంప్‌తో హీరోయిన్ నమిత ఫొటోషూట్.. వైరల్ అవుతున్న ఫొటోలు, వీడియోలు!

Advertisement
Credits: Instagram

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!